Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Monday 24 October 2016

Mixed vegetable curry(మిక్సీడ్ వెజిటబుల్ కర్రీ)


కావాల్సినవి:  బీన్స్ ముక్కలు- 1/2 కప్పు ,క్యాలీఫ్లవర్ ముక్కలు- 1 కప్పు, క్యారెట్ ముక్కలు- 1/2 కప్పు, క్యాప్సికం ముక్కలు -1/2 కప్పు, పచ్చి బఠాణి -1 కప్పు, సొరకాయ ముక్కలు -1/2 కప్పు, అల్లం- 1/2 అంగుళం, బంగాళాదుంప ముక్కలు -1/2 కప్పు, చిలకడదుంప ముక్కలు -1/2 కప్పు  ఉల్లిపాయ ముక్కలు- 1 కప్పు, పచ్చిమిర్చి-2, వెల్లుల్లి రెబ్బలు -3, టమాట ముక్కలు -1 పెద్ద కప్పు, ధనియాల పొడి -1 టీస్పూన్, గరంమసాలా -1 టీస్పూన్, జీలకర్ర -1/4 టీస్పూన్, లవంగాలు-4, దాల్చినచెక్క -2ముక్కలు, కొత్తిమీర -తగినంత, ఉప్పు- రుచికి సరిపడినంత, కారం- 1 టీస్పూన్. పచ్చికొబ్బరి -1టేబుల్ స్పూన్.



తయారీ:  స్టవ్ మీద కడాయి  పెట్టి నూనె పోయాలి, నూనె వేడి అయ్యాక లవంగాలు, దాల్చినచెక్క, అల్లం ,వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు వేసి వేగాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం పసుపు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. తరువాత టమాట ముక్కలు కూడా వేసి నూనె బయటికి వచ్చే వరకు మగ్గనిచ్చి, ధనియాలపొడి, గరం మసాలా, కారం వేసి 2 నిమిషాలు కలయబెట్టాలి.


 తరువాత కూరగాయ ముక్కలని వేసి కొంచెం ఉప్పు చల్లి, మసాలా అంతా ముక్కలకి పట్టేలా కలయపెట్టి, 3 నిమిషాలపాటు తక్కువ మంట మీద మూత పెట్టి మగ్గనివ్వాలి. తరువాత ముక్కలు మునిగే వరకు నీరు పోసి మరో 15 నిమిషాలు ఉడికించుకోవాలి.


ముక్కలు మెత్తబడ్డాక కొబ్బరి తురుము మరియు కొత్తిమీర కూడా వేసి కలిపి 5 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి, గిన్నెలోకి తీసుకుని వడ్డించటమే.ఈ  కూర చపాతీ, రోటి, అన్నంలోకి బాగుంటుంది.


గమనిక
  • కూర పలుచగా అయితే  1 టీస్పూన్ సెనగపిండి లో నీరు కలుపుకుని కూరలో వేసి, 5 నిమిషాలు ఉడికిస్తే గుజ్జులా ఉంటుంది. అలానే కొబ్బరి తురుముకి బదులు కొబ్బరి పాలు వేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది. 
  • మీకు నచ్చిన కూరగాయలతో ఈ కూర చేసుకోవచ్చు.  


No comments:

Post a Comment