Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Wednesday 26 October 2016

Allam charu/ Ginger rasam(అల్లం చారు)


కావాల్సినవి :
టమాటాలు- 2, పచ్చిమిర్చి -1/2, అల్లం - 1 అంగుళం, చింతపండు - 1/2 నిమ్మకాయ అంత ,కొత్తిమీర - 2 రెమ్మలు, రసం పొడి - 1 టీస్పూన్, పసుపు -చిటికెడు, ఉప్పు -తగినంత, నీళ్లు - 3 కప్పులు.
తాలింపు కొరకు :
కరివేపాకు- 2 రెమ్మలు ,ఎండుమిర్చి -2, జీలకర్ర - 1/4 టీస్పూన్, ఆవాలు - 1/4 టీస్పూన్, ఇంగువ - చిటికెడు, పచ్చిపప్పు - 1/2 టీస్పూను, నూనె- 2 స్పూన్, వెల్లుల్లి -2/3.


తయారీ :
ముందుగా గిన్నెలో టమాటా ముక్కలు ,పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు ,కొత్తిమీర ,రసం పొడి ,పసుపు ,ఉప్పు మరియు చింతపండు వేసి బాగా పిసకాలి. తరువాత ఆ మిశ్రమంలో నీళ్లు పోసి, స్టవ్ మీద పెట్టుకోవాలి. 15 నిమిషాలు బాగా మరిగించుకోవాలి.


తరువాత కడాయిలో నూనె పోసుకుని కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, ఇంగువ, పచ్చిపప్పు మరియు దంచిన వెల్లిలుని వేసి బాగా వేయించుకోవాలి. తాలింపుని చారులో వేసుకుని 1 నిమిషం మరిగించి సర్వ్ చేసుకోడమే.


1 comment:

  1. బహు రుచికరమైన ఆరోగ్యాన్ని ఒసగే చారు , మీపేర నేను పంచుకుంటున్నానండీ .

    ReplyDelete