Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Wednesday 12 October 2016

Shake it off Bangalore review



" షేక్ ఇట్ ఆఫ్ " ఈ పేరు వింటేనే మీకు అర్థమవుతుంది కదూ ఇక్కడ ఏం దొరుకుతుందో, అదేనండి షేక్స్. మేము బెంగుళూరుకి వెళ్ళినపుడు జయానగర్లో ఉన్న ఈ కెఫెకు వెళ్లడం జరిగింది. బయట ఎండేమో మండిపోతుంది, ఏదన్నా చల్లగా తాగుదాం అని ఈ కెఫెకి వెళ్ళాం. లోపలకి ఎంటర్ అవ్వగానే మాకు గ్రాఫిటీతో పెయింట్ చేసిన గోడలు మరియు చెస్ బోర్డులు ఆహ్వానం పలికాయి. విస్తీర్ణం కొద్దిలో అయినా షేక్స్ మాత్రం అద్భుతం .



మేము కోల్డ్ కాఫీ , కూల్ బ్లూ , బెర్రీ షేక్ , బుబ్బా బుబ్బా , కిట్టిక్యాట్ , ఓరియో షేక్ మరియు ఫెర్రేరో రోచెర్ షేక్ ఆర్డర్ చేసాం. మాకు అన్నీ షేక్స్ బాగా నచ్చాయి. ముఖ్యంగా బుబ్బా బుబ్బా షేక్ బబూల్ గమ్ టెస్టుతో డిఫ్రెంటుగా ఉంది . మీరు గనుక బెంగళూరులో ఉన్న,లేక బెంగళూరుకి వెళ్ళే ప్లాన్ ఉంటె, మీ వీలుని బట్టి ఇక్కడ షేక్స్ ని ట్రై చేయండి.
మా రివ్యూ:
రేటింగ్ : 8/10
రికమెండ్ చేయదగిన ఐటమ్స్కోల్డ్ కాఫీ , బుబ్బా బుబ్బా , బెర్రీ బ్లాస్ట్.
 ధర: 250-350 రూపాయలు
బుకింగ్ : శని ఆదివారలు తప్పకుండా టేబుల్ బుకింగ్ చేసుకోవాలి 

No comments:

Post a Comment