Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Saturday 15 October 2016

Pongali,payasam.paramannam,sweet pongal (పొంగలి/ పాయసం /పరమాన్నం)


కావాల్సినవి: 
బియ్యం - 1 కప్పు, పచ్చి శనగపప్పు- 3 టేబుల్  స్పూన్లు , సగ్గుబియ్యం - 3 టేబుల్ స్పూన్లు ,యాలకలు- 2/3, నెయ్యి- 4 స్పూన్లు, పాలు - 2 కప్పులు , బెల్లం - 1 కప్పు లేక 3/4 కప్పు,  జీడిపప్పులు- 5-8, కిస్మిస్- 5, బాదంపప్పు- 5, ఉప్పు - చిటికెడు



తయారీ
             ముందుగా బియ్యాన్ని, పచ్చి శనగపప్పుని, సగ్గుబియ్యాన్నినీళ్లలో అరగంట నానబెట్టాలి.  అడుగు మందగా ఉన్న గిన్నె తీసుకోవడంవలన పొంగలి అడుగు అంటకుండా ఉంటుంది.  స్టవ్ మీద గిన్నెని ఉంచాలి అందులో 1.1/2  కప్పుల నీరు మరియు 1 కప్పు పాలు కాగబెట్టాలి. పొంగు వస్తునప్పుడు ముందుగా నానబెట్టిన సగ్గుబియ్యం, పచ్చిపప్పు మరియు బియ్యాన్ని అందులో వేసి కొంచెం మెత్తగా ఉడికించుకోవాలి, మధ్య మధ్య లో కలయబెట్టడం మర్చిపోకండి .


బియ్యం ఉడికాక బెల్లం, దంచిన యాలుకల పొడి మరియు ఒక కప్పు పాలు పోసి దగ్గరికి వచ్చేదాకా కలుపుతూఉండాలి. తరువాత చిన్న కడాయిలో నెయ్యిపోసి జీడిపప్పు, బాదం మరియు కిస్మిస్ వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఈ వేపిన  డ్రై  ఫ్రూట్ లు  , చిటికెడు ఉప్పు మరియు నెయ్యి పొంగలిలో వేసి ఒకసారి కలపాలి.అంతేనండి కమ్మని పొంగలి తయారయ్యింది  . దీనీలో  ముద్దపప్పు, నెయ్యి వేసుకుని  తింటే మరింత రుచిగా ఉంటుంది.


 గమనిక:
  1. కొత్త బియ్యంతో పొంగలి చేస్తే జిగురు ఉండి ఇంకా రుచిగా ఉంటుంది. 
  2. తీపి తక్కువ అనిపిస్తే ఇంకొంచెం బెల్లం వేసుకోవచ్చు. . 
  3. ఉప్పు వేయడంవలన తక్కువ బెల్లంతో తీపి సరిపోయినట్లు అనిపిస్తుంది. 
  4. కొంచెం పచ్చికొబ్బరి  ముక్కల్ని కూడా వేసుకోవచ్చు.    



No comments:

Post a Comment