Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Friday 21 October 2016

vegetable pasta( వెజిటబుల్ పాస్తా)



కావాల్సినవి: పాస్తా- 1కప్పు, ఉల్లిపాయ- 1, పచ్చిమిర్చి- 2, వెల్లుల్లి- 3 రెబ్బలు, క్యారెట్ - 1(చిన్నది ), క్యాప్సికం -1, పచ్చి బఠాణి - 1టేబుల్ స్పూను, స్వీట్ కార్న్ -1టేబుల్ స్పూను, ఆలివ్స్ -10, ఆలివ్ ఆయిల్- 1 టేబుల్ స్పూను ,పాస్తా సాస్- 2 టేబుల్ స్పూన్లు,గ్రేటెడ్ చీజ్- 1 స్పూను, ఉప్పు- తగినంత, ఒరిగానో - పావు స్పూను, బాసిలికం- చిటికెడు, చిల్లీ  ఫ్లేక్స్  -1/2 స్పూను.





తయారీ:
ముందుగా ఒక గిన్నెలో నీరు తీసుకుని కొంచెం ఉప్పు, 1 స్పూను ఆయిల్ వేసి మరగనివ్వాలి. ఆ మరుగుతున్న నీటిలో పాస్తా వేసి ఉడికించుకోవాలి. పాస్తా ఉడికించిన పాస్తా లో నీరు వంపేసి పక్కన పెట్టుకోవాలి.


 ఒక కడాయిలో ఆలివ్ ఆయిల్ పోసి, వెల్లుల్లి ముక్కల్నికొద్దిగా వేయించుకోవాలి. తర్వాత ఉల్లిపాయ, తరిగిన పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు వేసి 2 నిమిషాలు మగ్గనిచ్చి, క్యారెట్ ,బఠాణీ, క్యాప్సికం, మొక్క జొన్న గింజలు కూడా వేసి ముక్కలు మెత్తపడేవరకు వేయించుకోవాలి.


తరువాత పాస్తా సాస్, ఆలివ్స్ వేసి కలపాలి. మరో 2 నిమిషాలు ఆగి ఒరిగానో, బాసిలికం వేసి బాగా కలపాలి. చివరగా పాస్తా వేసి కలిపి, 2 నిమిషాలు తక్కువ మంటమీద మగ్గనివ్వాలి. చివరగా చీజ్  వేసుకుని, ప్లేట్ లోకి తీసుకొని చిల్లి ఫ్లేక్స్ వేసుకుని వేడివేడిగా తనటమే.



గమనిక: చిల్లి ఫ్లేక్స్ కోసం ఎండు మిరపకాయలుని తీసుకుని కచ్చాపచ్చగా పొడి చేస్తే సరిపోతుంది. పాస్తా సాస్ దొరకని వాళ్ళు టమాటో వేసుకుని చేసుకోవచ్చు. బాసలికం అంటే ఎండపెట్టిన తులసి ఆకుల పొడి.


No comments:

Post a Comment