Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Wednesday 30 November 2016

ullipaya guddu kura/onion egg curry (ఉల్లిపాయ గుడ్డు కూర)


కావాల్సినవి: ఉడికించిన కోడిగుడ్లు -4, ఉల్లిపాయలు పెద్దవి -3, పచ్చిమిర్చి-3, అల్లం మరియు వెల్లుల్లి ముక్కలు -1 టేబుల్ స్పూన్, పచ్చిపప్పు-1 టీస్పూన్, మినపప్పు-1 టీస్పూన్, ఆవాలు -1/4 టీస్పూన్, జీలకర్ర-1 టీస్పూన్, ఎండుమిర్చి- 2, నూనె -3 టేబుల్ స్పూన్స్, ధనియాల పొడి -1 టీస్పూన్, కారం -1 టేబుల్ స్పూన్, కరివేపాకు-2 రెమ్మలు, ఉప్పు -తగినంత, పసుపు -కొద్దిగా, కొత్తి మీర -తగినంత.

Tuesday 29 November 2016

Moori mixture ,Maramarala mixture(మూరీ మిక్సర్ (ముంత కిందపప్పు)


కావాల్సినవి: మరమరాలు (బొంగు పేలాలు)-1 పెద్ద కప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు-1/2 కప్పు, టమాటా ముక్కలు-1 కప్పు, పచ్చిమిర్చి-2/3, మిక్స్డ్ మిక్సర్-1/2 కప్పు, చాట్ మసాలా -1 టీస్పూన్, నల్ల ఉప్పు- కొద్దిగా, ఉప్పు-తగినంత, నిమ్మరసం-1 టేబుల్ స్పూన్ ,వేయించిన సెనగ పప్పు-1/2 కప్పు, కార్న్ ఫ్లేక్స్ - 3/4కప్పు, కొత్తిమీర-తగినంత.

idly(ఇడ్లీ)


కావాల్సినవి: మినపప్పు -1 కప్పు , ఇడ్లీ రవ్వ-2 కప్పులు, ఉప్పు -తగినంత.

Friday 25 November 2016

pappula chekkalu/rice crackers(పప్పుల చెక్కలు)


కావాల్సినవి: వరి పిండి-1/2 కేజీ ,నాన పెట్టిన పెసరపప్పు-1 కప్పు, నాన పెట్టిన పచ్చి సెనగ పప్పు-1/2 కప్పు, వేయించిన వేరుశెనగ పప్పు పొడి-1/2 కప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్-3 టేబుల్ స్పూన్స్, కారం-3 టేబుల్ స్పూన్స్, ఉప్పు-తగినంత, బటర్ లేదా వెన్న పూస  - 3 టేబుల్ స్పూన్స్, జీలకర్ర -2టీస్పూన్స్, నూనె-డీప్ ఫ్రై కి సరిపడినంత, కరివేపాకు-2 రెమ్మలు.

Dondakaya fry(దొండకాయ వేపుడు)


కావాల్సినవి : దొండకాయ -1/2 కేజీ ,ఉప్పు -1/2 టీస్పూన్, కారం -1 టీస్పూన్ ,పసుపు -చిటికెడు, నూనె -3 టేబుల్ స్పూన్స్.
తాలింపు కొరకుఆవాలు -1/4 టీస్పూను, జీలకర్ర -1/4 టీస్పూను, పచ్చిపప్పు -1/2 టీస్పూను, ఇంగువ - చిటికెడు ,మినపప్పు -1/2 స్పూన్ ,కరివేపాకు -2 రెమ్మలు, వెల్లులి -2రెబ్బలు, ఎండు మిరపకాయ -2.

Thursday 24 November 2016

gummadikaya kalagalupu kura(గుమ్మడికాయ కలగలుపు కూర)


కావాల్సినవి: గుమ్మడికాయ ముక్కలు-1 కప్పు, వంకాయ ముక్కలు-1 కప్పు, చిలకడదుంప ముక్కలు(స్వీట్ పొటాటో)-1 కప్పు, ఉల్లిపాయ-1, పచ్చిమిర్చి-3, చింతపండు గుజ్జు-2 టేబుల్ స్పూన్స్, బెల్లం తురుము-2 టేబుల్ స్పూన్స్, కారం-1టేబుల్ స్పూన్స్, ఉప్పు-తగినంత, కొత్తిమీర- తగినంత, నూనె-3 టేబుల్ స్పూన్స్.
తాలింపుకొరకు: ఆవాలు-1/4 టీస్పూన్, జీలకర్ర-1/4 టీస్పూన్, వెల్లుల్లి రెబ్బలు-2, పచ్చిపప్పు-1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి-2, కరివేపాకు-2 రెమ్మలు, పసుపు-3/4 టీస్పూన్.

Wednesday 23 November 2016

avacado keera salad(అవకాడో కీరా సలాడ్)


కావాల్సినవి: అవకాడో-1, కీరా ముక్కలు-1 కప్పు, టమాటా ముక్కలు-1 కప్పు, ఆలివ్ ఆయిల్-2 టేబుల్ స్పూన్స్, కొత్తిమీర-కొద్దిగా, ఉప్పు-తగినంత, ఉల్లిపాయ-1, మిరియాల పోడి -చిటికెడు ,నిమ్మరసం-2 టేబుల్ స్పూన్స్.


తయారీ: ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని దానిలో కీరా దోసకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, అవకాడో ముక్కలు,కొత్తిమీర, ఉప్పు,ఆలివ్ నూనె, నిమ్మ రసం వేసి ముక్కలకి పట్టేట్టు కలుపుకోవాలి.


ఈ సలాడ్ ని ఫ్రెష్ గా కానీ లేదా ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తీసి  కానీ తినొచ్చు, తినే ముందు మిర్యాల పొడి చల్లుకుని తింటే రుచిగా ఉంటుంది. మిర్యాల పొడి బదులుగా ఘాటు కోసం సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకున్న చాల రుచిగా ఉంటుంది. 

aloo parata(ఆలూ పరాట)


కావాల్సినవి: ఉడికించిన బంగాళాదుంపలు- 4, సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కలు- 1/2 కప్పు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి-2, గోధుమ పిండి-1 కప్పు, కారం-1 టీస్పూన్, చాట్ మసాలా-1 టీస్పూన్, ఆంచూర్ పొడి -1/2 టీస్పూన్. నెయ్యి/నూనె -తగినంత, కొత్తిమీర -తగినంత, జీలకర్ర  పొడి-1/2 టీస్పూన్ ,ధనియాల పొడి-1/2 టీ స్పూన్.



తయారీ: ముందుగా ఒక గిన్నెలో గోధుమ పిండి, కొంచెం ఉప్పు, నూనె వేసి మెత్తగా చపాతీ పిండిలా కలుపుకుని  పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి 3 నిమిషాలు మగ్గనిచ్చి, దానిలో జీలకర్ర పొడి, ధనియాల పొడి, చాట్ మసాలా, ఆంచూర్ పొడి వేసి 1 నిమిషం వేయించి బంగాళాదుంపలను చిదుముకుని వేసి ,ఉప్పు, కారం వేసి అన్ని కలిసేట్టు కలుపుకోవాలి . ఈ మిశ్రమాన్నీ మెత్తగా గుజ్జులా మెదుపుకోని చల్లారనివ్వాలి. తరువాత గోధుమ పిండి ముద్దని తీసుకుని చివరలు పలుచగా మధ్యలో మందంగా ఉండేట్టు గుండ్రంగా వత్తుకోవాలి .


ఇలా వత్తుకున్న చపాతీ మధ్యలో బంగాళాదుంప మిశ్రమాన్నీ ఉంచి మూసివెయ్యాలి. తరువాత చపాతీ కర్రతో వత్తుతు లోపల పెట్టిన మిశ్రమం బయటికి రాకుండా సమంగా ఉండేట్టు నెమ్మదిగా గుండ్రంగా చేసుకోవాలి. పిండి అంటుకోకుండా ఉండాలి అంటే పొడి గోధుమపిండి చల్లుకుంటూ ఉండండి. ఇలా తయారు అయిన పరాటాలని పెనం మీద నెయ్యి వేసి రెండు వేపులా మీడియం మంట  మీద కాల్చుకొని  తీసుకోవాలి. అంతే వేడి వేడి ఆలూ పరాట సిద్ధం .


గమనిక: బంగాళ దుంపలని ఉడికించాక తురుముకుని గాని లేదా చాక్ తో సన్నగా తురుగుకొనికానీ ఉపయాగించుకోండి. ఎందుకంటే దుంప ముక్కలు తగులుతూ ఉంటె పరాట సరిగా రాదూ. అలానే ఉల్లిపాయ ,మిర్చి ముక్కలు బాగా సన్నగా తరుగుకోండి. మామిడి  పొడి లేని వాళ్ళు చాట్ మసాలా ఒక్కటే ఉపయోగించిన చాలు. లేదా కూరలో  కొంచెం నిమ్మకాయ రసం  పిండుకొండి .  

             

Tuesday 22 November 2016

Oats sankati(ఓట్స్ సంకటి)


కావాల్సినవి : ఓట్స్ -1 కప్పు ,నీళ్లు -2 కప్పులు ,ఉప్పు - 1/2 టీస్పూన్.


తయారీ : ఒక గిన్నెలో నీళ్లు పోసి బాగా మరిగించుకోవాలి. బాగా మరిగిన నీటిలో ఓట్స్ మరియు ఉప్పు వేసి దగ్గరికి అయ్యేవరకు  ఉడికించుకోవాలి. అంతే ఓట్స్ సంకటి రెడీ.   

Monday 21 November 2016

palakura kichidi(పాలకూర కిచిడి)



కావాల్సినవి: రైస్-1 కప్పు,పెసరపప్పు-1 కప్పు, ఉల్లిపాయ-1, పచ్చిమిర్చి-5, టమాటాలు-3, పాలకూర-1 కట్ట, అల్లం,వెల్లుల్లి ముక్కలు-1 టేబుల్ స్పూన్, చింతపండు-కొద్దిగా, కొత్తిమీర -కొద్దిగా, ధనియాల పొడి-1 టేబుల్ స్పూన్, గరంమసాలా-1 టీ స్పూన్. .
తాలింపు కొరకు: నెయ్యి -2 టేబుల్ స్పూన్స్, ఆవాలు-1/2 టీస్పూన్, జీలకర్ర-1/4 టీస్పూన్, పచ్చిపప్పు-1 టేబుల్ స్పూన్, మినపప్పు-1 టేబుల్ స్పూన్, జీడిపప్పు-10, పసుపు-కొద్దిగా, ఉప్పు-తగినంత, ఇంగువ-చిటికెడు, ఎండుమిర్చి-2/3, కరివేపాకు-2 రెమ్మలు.

beerakaya kura(బీరకాయ కూర)


కావాల్సినవి : బీరకాయ -1/2 కేజీ, పసుపు -1/4 టీస్పూన్, ఉప్పు -1 టీస్పూన్ , ఉల్లిపాయ -1, పచ్చిమిర్చి -2, కారం -1/2 టీస్పూన్, కొత్తిమీర -2 రెమ్మలు, నీళ్లు -1 కప్పు.  
తాలింపు కొరకు : ఆవాలు -1/4 టీస్పూను, జీలకర్ర -1/4 టీస్పూను, పచ్చిపప్పు -1/2 టీస్పూను, ఇంగువ - చిటికెడు ,మినపప్పు -1/2 స్పూన్ ,కరివేపాకు -2 రెమ్మలు, వెల్లులి -2రెబ్బలు, ఎండు మిరపకాయ -2. 

Potlakaya perugu pachadi(పొట్లకాయ పెరుగు పచ్చడి)



కావాల్సినవి : పొట్లకాయ -1/2 కేజీ , టమాట -1, ఉల్లిపాయ -1, పసుపు -చిటికెడు, ఉప్పు -3/4 టీస్పూన్ ,పచ్చిమిర్చి -2, కారం -1/2 టీస్పూన్, నూనె -2 టేబుల్ స్పూన్, పెరుగు -1.1/2 కప్పు ,కొత్తిమీర -2 రెమ్మలు.
తాలింపు కొరకు : ఆవాలు -1/4 టీస్పూను, జీలకర్ర -1/4 టీస్పూను, పచ్చిపప్పు -1/2 టీస్పూను, ఇంగువ - చిటికెడు ,మినపప్పు -1/2 స్పూన్ ,కరివేపాకు -2 రెమ్మలు, వెల్లులి -2రెబ్బలు, ఎండు మిరపకాయ -2. 

Potlakaya vepudu,Snake-gourd fry(పొట్లకాయ వేపుడు)


కావాల్సినవి : పొట్లకాయ -1/2 కేజీ , టమాట -1, ఉల్లిపాయ -1, పసుపు -చిటికెడు, ఉప్పు -3/4 టీస్పూన్ ,పచ్చిమిర్చి -2, కారం -1/2 టీస్పూన్, నూనె -2 టేబుల్ స్పూన్.
తాలింపు కొరకు : ఆవాలు -1/4 టీస్పూను, జీలకర్ర -1/4 టీస్పూను, పచ్చిపప్పు -1/2 టీస్పూను, ఇంగువ - చిటికెడు ,మినపప్పు -1/2 స్పూన్ ,కరివేపాకు -2 రెమ్మలు, వెల్లులి -2రెబ్బలు, ఎండు మిరపకాయ -2. 

Saturday 19 November 2016

Gongura pachadi(గోంగూర పచ్చడి)


కావాల్సినవి :  గోంగూర -1 పెద్ద కట్ట, పచ్చిమిర్చి -4, టమాటో - 1/2, ఉల్లిపాయ -1, ఉప్పు- 1/2 టీస్పూన్(తగినంత), పసుపు - చిటికెడు, నూనె - 2టేబుల్ స్పూన్లు.
తాలింపు కొరకు :  ఆవాలు -1/4 టీస్పూను, జీలకర్ర -1/4 టీస్పూను, పచ్చిపప్పు -1/2 టీస్పూను, ఇంగువ - చిటికెడు ,మినపప్పు -1/2 స్పూన్ ,కరివేపాకు -2 రెమ్మలు, వెల్లులి -2రెబ్బలు, ఎండు మిరపకాయ -2. 



తయారీ : గోంగూరని బాగా శుభ్రపరుచుకుని ఆకులని వేరుచేసుకోవాలి. గిన్నెలో గోంగూర ఆకులు మరియు నీళ్లు పోసి పొంగు వచ్చేవరకు ఉడికించుకోవాలి. పచ్చిమిర్చి మరియు టమాటోని కచ్చాపచ్ఛాగా మిక్సీ వేసుకుని ఉడికించన గోంగూర కూడా వేసి ఒక్కసారి మిక్సీ తిప్పి ఆపేయాలి. 



తరువాత కడాయిలో నూనె పోసి తాలింపు సమాన్లు మరియు కచ్చాపచ్చాగా దంచి వెల్లుల్లిని వేసుకోవాలి .ఉల్లిపాయలను వేసి ఒక నిమిషం వేయించుకుని ముందుగా మిక్సీ వేసుకున్న గోంగూర పచ్చడిని,ఉప్పు మరియు పసుపు వేసి 2 నిమిషాలు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే మీ ముందు గుమగుమలాడే గోంగూర పచ్చడి సిద్ధం. 


          
      

Friday 18 November 2016

tomato mulakkaya kura(టమాటా ములక్కాయ కూర)


కావాల్సినవి: లేత ములక్కాయ-1, టమాటాలు-4, పచ్చిమిర్చి-2, ఉల్లిపాయ-1, అల్లం వెల్లుల్లి ముక్కలు-1 టీస్పూన్, ధనియాల పొడి-1 టీస్పూన్, గరంమసాలా-1/2 టీస్పూన్. కారం-1 టీ స్పూన్, ఉప్పు-రుచికి తగినంత, కొత్తిమిర -కొద్దిగా.

majjiga pulusu/butter milk pulusu(మజ్జిగ పులుసు)


కావాల్సినవి: పుల్ల పెరుగు-1 కప్పు, పెద్ద ఉల్లిపాయ-1, పచ్చిమిర్చి-4, ఆవాలు-3/4 టీ స్పూన్, జీలకర్ర-1/2 టీ స్పూన్, పచ్చిపప్పు-1 టీస్పూన్, ఎండు మిరపకాయలు-2, అల్లం,వెల్లుల్లి ముక్కలు-1 టీస్పూన్, కరివేపాకు-2 రెమ్మలు, పసుపు-3/4 టీ స్పూన్, ఉప్పు-రుచికి తగినంత, కొత్తి మీర-కొద్దిగా.


తయారీ: ముందుగా పెరుగులో నీరు పోసుకుని పల్చగా మజ్జిగలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక  గిన్నె తీసుకుని స్టవ్ మీద పెట్టి, నూనె వేసి ఆవాలు,పచ్చిపప్పు ,జీలకర్ర, పసుపు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఉప్పు చల్లి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. చివరగా మజ్జిగ కూడా పోసి కలయపెట్టి ఉప్పు సరిచూసుకుని స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తి మీరతో అలంకరించుకోటమే

Wednesday 16 November 2016

vaamu annam/ Vamu rice(వాము రైస్)


కావాల్సినవి: వాము-1టేబుల్ స్పూన్ ,ఉడికించిన రైస్-1 పెద్ద కప్పు, ఆవాలు-3/4 టీస్పూన్, పచ్చిపప్పు-1 టీస్పూన్, జీడిపప్పు-2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి-3, కరివేపాకు -2 రెమ్మలు, జీలకర్ర- 1 టీస్పూన్, ఎండుమిర్చి-2, నూనె/నెయ్యి -2 టేబుల్ స్పూన్లు, ఉప్పు-రుచికి తగినంత, కొత్తి మీర-కొద్దిగా ,అల్లం మరియు వెల్లుల్లి ముక్కలు-1 టీ స్పూన్.


తయారీ: ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని నూనె లేదా నెయ్యి వేసి వేడి చెయ్యాలి. దానిలో ఆవాలు,జీల కర్ర, జీడిపప్పు,పచ్చిపప్పు, వాము ,ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగాక ,అల్లము వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగాక ఉడికించిన రైస్ వేసి ,ఉప్పు చల్లి అన్ని కలిసేట్టు తిప్పుకుని చివరగా కొత్తిమీరతో అలంకరించుకోటమే. అంతే వేడి వేడి వాము రైస్ సిద్ధం.


Oats chapathi(ఓట్స్ చపాతీ)


కావాల్సినవి : ఓట్స్ -1 కప్పు ,గోధుమ పిండి- 1 కప్పు ,పచ్చిమిర్చి-2, ఉల్లిపాయ - 1 (చిన్నది), కొత్తిమీర -2 రెమ్మలు ,జీలకర్ర - 1/4 స్పూన్ ,ఉప్పు-సరిపడినంత ,నెయ్యి /నూనె -1 స్పూన్.


తయారీ : ముందుగా ఓట్స్ ని మిక్సీ పట్టుకుని పొడిలా చేసుకోవాలి. ఓట్స్ పొడిలో గోధుమ పిండి, సన్నగా తరిగిన ఉలికిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర ,ఉప్పు, నెయ్యి /నూనె వేసి కొద్దీ కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి.


చిన్న ముద్ద తీసుకుని చపాతి కర్రతో గుండ్రంగా రుద్దుకోవాలి. స్టవ్ మీద పెనం పెట్టుకుని అది వేడియెక్కిన తర్వాత చపాతిని కాల్చుకోవాలి. నెయ్యి లేక నూనె వేసి కాలిస్తే ఇంకా రుచిగా ఉంటాయి.     

   

Chicken pakodi(చికెన్ పకోడీ)


కావాల్సినవి :
బోన్ లెస్ చికెన్ - 250 గ్రా, నూనె - 1 టీస్పూన్ ,ఉప్పు -సరిపడినంత , జీలకర్ర పొడి - 1/2 టీస్పూన్, పచ్చిమిర్చి -3, ఉల్లిపాయ -1, అల్లం వెల్లులి పేస్ట్ -1 టీస్పూన్ ,నిమ్మకాయ రసం -1 స్పూన్ ,శెనగపిండి -1 కప్పు, కొత్తిమీర - 2 రెమ్మలు ,వంట సోడా -1/4 టీస్పూన్, పసుపు -1/4 టీస్పూన్ ,కారం - 1/2 టీస్పూన్. 


తయారీ :
ముందుగా చికెన్ ని బాగా శుభ్రపరుచుకుని అందులో కొద్దిగా ఉప్పు ,కారం ,పసుపు, జీలకర్ర పొడి, అల్లం వెల్లులి పేస్ట్, నిమ్మకాయ రసం వేసుకుని బాగా కలిపి అరగంట నాననివ్వాలి. 


ఒక గిన్నెలో శెనగపిండిలో వంట సోడా మరియు నూనె వేసి కొద్దిగా నీళ్లు పోసుకుని పేస్టులా కలుపుకుని మారినెట్ చేసిన చికెన్ లో వేసుకోవాలి.



 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మరియు కొత్తిమీర వేసి అన్నిటిని బాగా కలుపుకోవాలి. తరువాత చేతితో పిండిని తీసుకుని బాగా కాగిన నూనె లో వేసుకుని రెండు వైపులా తిప్పుతూ ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి. వేడివేడి చికెన్ పకోడీ రెడీ. 

Tuesday 15 November 2016

Strawberry lassi(స్ట్రాబెర్రీ లస్సి)


కావాల్సినవి :
స్ట్రాబెర్రీలు- 7, పెరుగు - 1 కప్పు ,పంచదార - 4 టీస్పూన్లు.


తయారీ
స్ట్రాబెర్రీలు, పెరుగు మరియు పంచదార వేసి మెత్తగా మిక్సీ వేసుకోవాలి. 
చిక్కగా ఉన్న యెడల కొద్దిగా నీళ్లు పోసుకోవచ్చు.