Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Tuesday 1 November 2016

Dosa chutney,Onion chuntney/ Ulli chutney(ఉల్లి పచ్చడి (దోశ చట్నీ)


కావాల్సిన పదార్ధాలు:  పెద్ద ఉల్లిపాయ 1లేదా 2, ఎండు మిరపకాయలు -10, వేరుశెనగ విత్తనాలు(పల్లీలు)- కొద్దిగా , టమాటా చిన్నది -1, చింతపండు -కొద్దిగా,ఉప్పు -రుచికి సరిపడినంత.
తాలింపుకొరకు: జీలకర్ర -1/2 టీస్పూన్, పచ్చిపప్పు -1/2 టీస్పూన్, ఆవాలు -3/4 టీస్పూన్, వెల్లుల్లిరెబ్బలు -2/3, ఎండుమిర్చి -1, కరివేపాకు -2 రెమ్మలు, నూనె -2 టేబుల్ స్పూన్స్ ..


తయారీ: ముందుగా కడాయిలో నూనె పోసి, వేడి అయ్యాక పల్లీలు, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి, కొంచెం ఉప్పు చల్లి అవి మగ్గే వరకు ఉంచి, టమాటా కూడా వేసి అన్ని బాగా వేగనివ్వాలి. చివరగా చింతపండు కూడా వేసి 2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.


 చల్లారిన తరువాత మెత్తగా  మిక్సీ పట్టుకోవాలి. అదే కడాయిలో మరలా కొంచెం నూనె పోసి పోపు సామన్లు అన్ని వేసి వేగాక, ముందుగా చేసిపెట్టుకున్న ఉల్లిపాయ గుజ్జులో వేసి బాగా కలుపుకోవాలి. అంతే అంతో రుచికరమైన ఉల్లి పచ్చడి సిద్ధం. సాదా దోశ లేక రవ్వ దోశలోకి ఈ పచ్చడి అద్భుతంగా ఉంటుంది.


No comments:

Post a Comment