Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Saturday 19 November 2016

Gongura pachadi(గోంగూర పచ్చడి)


కావాల్సినవి :  గోంగూర -1 పెద్ద కట్ట, పచ్చిమిర్చి -4, టమాటో - 1/2, ఉల్లిపాయ -1, ఉప్పు- 1/2 టీస్పూన్(తగినంత), పసుపు - చిటికెడు, నూనె - 2టేబుల్ స్పూన్లు.
తాలింపు కొరకు :  ఆవాలు -1/4 టీస్పూను, జీలకర్ర -1/4 టీస్పూను, పచ్చిపప్పు -1/2 టీస్పూను, ఇంగువ - చిటికెడు ,మినపప్పు -1/2 స్పూన్ ,కరివేపాకు -2 రెమ్మలు, వెల్లులి -2రెబ్బలు, ఎండు మిరపకాయ -2. 



తయారీ : గోంగూరని బాగా శుభ్రపరుచుకుని ఆకులని వేరుచేసుకోవాలి. గిన్నెలో గోంగూర ఆకులు మరియు నీళ్లు పోసి పొంగు వచ్చేవరకు ఉడికించుకోవాలి. పచ్చిమిర్చి మరియు టమాటోని కచ్చాపచ్ఛాగా మిక్సీ వేసుకుని ఉడికించన గోంగూర కూడా వేసి ఒక్కసారి మిక్సీ తిప్పి ఆపేయాలి. 



తరువాత కడాయిలో నూనె పోసి తాలింపు సమాన్లు మరియు కచ్చాపచ్చాగా దంచి వెల్లుల్లిని వేసుకోవాలి .ఉల్లిపాయలను వేసి ఒక నిమిషం వేయించుకుని ముందుగా మిక్సీ వేసుకున్న గోంగూర పచ్చడిని,ఉప్పు మరియు పసుపు వేసి 2 నిమిషాలు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే మీ ముందు గుమగుమలాడే గోంగూర పచ్చడి సిద్ధం. 


          
      

No comments:

Post a Comment