Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Wednesday 30 November 2016

ullipaya guddu kura/onion egg curry (ఉల్లిపాయ గుడ్డు కూర)


కావాల్సినవి: ఉడికించిన కోడిగుడ్లు -4, ఉల్లిపాయలు పెద్దవి -3, పచ్చిమిర్చి-3, అల్లం మరియు వెల్లుల్లి ముక్కలు -1 టేబుల్ స్పూన్, పచ్చిపప్పు-1 టీస్పూన్, మినపప్పు-1 టీస్పూన్, ఆవాలు -1/4 టీస్పూన్, జీలకర్ర-1 టీస్పూన్, ఎండుమిర్చి- 2, నూనె -3 టేబుల్ స్పూన్స్, ధనియాల పొడి -1 టీస్పూన్, కారం -1 టేబుల్ స్పూన్, కరివేపాకు-2 రెమ్మలు, ఉప్పు -తగినంత, పసుపు -కొద్దిగా, కొత్తి మీర -తగినంత.

తయారీ: ముందుగా కడాయిలో నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, మినపప్పు, కరివేపాకు ,ఎండుమిర్చి వేసి వేగించుకోవాలి.


తరువాత అల్లం వెల్లుల్లి ముక్కలు,పచ్చి మిర్చి ముక్కలు ,పసుపు వేసి 1 నిమిషం వేయించి ఉడికించిన కోడిగుడ్లుకి గాట్లు పెట్టుకుని కడాయిలో వేసి ఉప్పు,కారం,ధనియాలపొడి వేసి 2 నిమిషాలు వేయించుకోవాలి.


తరువాత ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు వేసి 10 నిమిషాలు మీడియం మంట మీద మగ్గించుకోవాలి. ఉల్లిపాయ పచ్చి వాసనపోయి మెత్తపడ్డాక కొత్తి మీర వేసి కలుపుకొని గిన్నెలోకి తీసుకుని వడ్డించాలి .  అంతే ఎంతో తేలిక అయిన ఉల్లిపాయ కోడిగుడ్డు కూర రెడీ. 

గమనిక: వేగిన కోడిగుడ్డు ఇష్టం లేని వాళ్ళు ఉల్లిపాయలు వేగాక చివరిలో గోడిగుడ్లు వేసుకుంటే  సరిపోతుంది. 

No comments:

Post a Comment