Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Tuesday 15 November 2016

Mozzarella salad(మోజారెల్లా చీజ్ సలాడ్)


కావాల్సినవి: మోజారెల్లా చీజ్ - 50 గ్రా ,చెర్రీ టమాటాలు-6/7, సలాడ్ ఆకు- 2 పొరలు, మిరియాలపొడి-కొద్దిగా, ఉప్పు-రుచికి సరిపడినంత, ఆలివ్ ఆయిల్-1 టేబుల్ స్పూన్, ఎర్ర ఉల్లిపాయ-3/4 ముక్క ,నిమ్మరసం-1 టీ స్పూన్, ఎండు తులసి ఆకులు పొడి(బాసిలికం)-2 చిటికెలు.


తయారీ: ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలో సలాడ్ ఆకులని సన్నగా తరిగి వేసుకోవాలి. దానిలోనే చెర్రీ టమాటా ముక్కలు,మోజారెల్లా చీజ్  ముక్కలు,పోడవుగా తరిగిన ఉల్లి ముక్కలు,ఉప్పు ,ఆలివ్ నూనె, నిమ్మరం,బాసిలికం  పొడి వేసి బాగా కలిపి 5 నిముషాలు పక్కన పెట్టుకుని తినే ముందు మిర్యాల పొడి చల్లుకోవాలి. అంతే ఆరోగ్యకరమైన సలాడ్ రెడీ.

No comments:

Post a Comment