Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Thursday 10 November 2016

vankaya rice/brinjal rice(వంకాయ రైస్)



కావాల్సినవి :
వంకాయలు - 1/4 కేజీ, ఉల్లిపాయ -1, పచ్చిమిర్చి -3, కరివేపాకు -2 రెమ్మలు, చింతపండు గుజ్జు / నిమ్మకాయ రసం -1 స్పూన్, ఉడికిన అన్నం -1. 1/2 కప్పు, జీలకర్ర - 1/4 స్పూన్, చెక్క -1/2 అంగుళం, యాలకలు -2, లవంగాలు -2, నూనె -2 టేబుల్ స్పూన్, కొత్తిమీర - 2 రెమ్మలు.


తయారీ :
 ముందుగా కడాయిలో నూనె పోసుకుని, అది వేడి అయ్యాక  జీలకర్ర, చెక్క, యాలకలు, లవంగాలు వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు ,పచ్చిమిర్చి ముక్కలు ,కరివేపాకు వేసి 1 నిమిషం వేయించుకోవాలి.



తరవాత వంకాయ ముక్కలు, ఉప్పు,పసుపు వేసుకుని మరో 5 నిమిషాలు వంకాయ ముక్క మెత్తబడే వరకు  వేయించుకోవాలి. తర్వాత చింతపండు గుజ్జు కూడా వేసి మరో  3 నిమిషాలు వేయించుకోవాలి.చివరగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసి బాగా కలిపి,కొత్తిమీర చల్లుకుని సర్వ్ చేస్కోడమే.


           

No comments:

Post a Comment