Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Wednesday 9 November 2016

Tomato rasam( టమాటా రసం)


కావాల్సినవి: టమాటాలు -3, చింతపండు - గోలి అంత, పసుపు -చిటికెడు, ఉప్పు -1 టీస్పూన్ ,కారం - 1/2 టీస్పూన్, రసం పొడి -1 టీస్పూన్, కొత్తిమీర -2 రెమ్మలు.

తాలింపు కొరకు :  
కరివేపాకు- 2 రెమ్మలు ,ఎండుమిర్చి -2, జీలకర్ర - 1/4 టీస్పూన్, ఆవాలు - 1/4 టీస్పూన్, ఇంగువ - చిటికెడు, పచ్చిపప్పు - 1/2 టీస్పూను, నూనె/నెయ్యి - 2 స్పూన్, వెల్లుల్లి -2/3.


తయారీ :
టమాటాలు , చింతపండు, పసుపు, ఉప్పు, కారం, రసం పొడి అన్నిటిని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకుని 2.1/2 కప్పులు నీళ్లు పోసుకుని పదిహేను నిమిషాలు బాగా మరిగించుకోవాలి.


తర్వాత ఒక కడాయిలో నూనె /నెయ్యి వేసుకుని అది వేడెక్కాకా తాలింపు సామాను మరియు వెల్లులి ముక్కలు వేసి అవి చిటపటలాడాక రసంలో వేసి 1 నిమిషం మరిగించాలి. తర్వాత కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే  టమాటా రసం రెడీ.

No comments:

Post a Comment