Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Tuesday 8 November 2016

Bombai ravva upma(తెల్లరవ్వ ఉప్మా (బొంబాయి రవ్వ ఉప్మా)


కావాల్సినవి: బొంబాయి రవ్వ -1 కప్పు, మంచి నీరు -2 కప్పులు, ఉల్లిపాయ -1, పచ్చిమిర్చి-4, క్యారెట్ ముక్కలు -1/2 కప్పు, పచ్చి బఠాణి -3/4 కప్పు, టమాటా ముక్కలు -1/2 కప్పు, అల్లం ముక్కలు -1 టేబుల్ స్పూన్, వేరుశెనగలు(పల్లీలు) -1/4 కప్పు, జీలకర్ర -1 టీస్పూన్, పచ్చిపప్పు -1 టీస్పూన్, ఆవాలు -1/2 టీస్పూన్, కరివేపాకు -2రెమ్మలు, కొత్తిమీర -తగినంత, ఉప్పు-రుచికి సరిపడినంత, నిమ్మరసం -1 టేబుల్ స్పూన్.



తయారీ: ముందుగా కడాయి స్టవ్ మీద పెట్టుకుని రవ్వ వేసి 5 నిమిషాలు పచ్చి వాసనా పోయే వరకు వేయించి, వేరే గిన్నెలోకి పోసుకుని పక్కన పెట్టుకోండి. అదే కడాయిలో నూనె పోసి ఆవాలు, పచ్చిపప్పు, జీలకర్ర, కరివేపాకు, వేరుశెనగ విత్తులు వేసి వేయించుకోవాలి. తరువాత అల్లం, పచ్చి మిర్చి వేసి వేగాక క్యారెట్ ముక్కలు, పచ్చి బఠాణి  వేసి కొంచెం ఉప్పు చల్లి మూత పెట్టి తక్కువ మంట మీద 5 నిమిషాలు మగ్గనివ్వాలి.


 తరువాత టమాటా ముక్కలు, కొత్తిమీర కూడా వేసి మరో 5 నిమిషాలు ఉంచి దానిలో నీరు పోసి, ఉప్పు కూడా వేసుకుని మరగనివ్వాలి. నీరు బాగా మరిగి పొంగు వస్తున్నప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వని నీటిలో వేస్తూ తిప్పుకోవాలి. స్టవ్ మంట తగ్గించి రవ్వని బాగా ఉండలు లేకుండా కలయబెట్టుకుని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీర , నిమ్మరసం వేసుకుని కలుపుకుని ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. కారం పొడిలో నెయ్యి వేసుకుని తింటే  ఉప్మా చాలా రుచిగా ఉంటుంది.


గమనిక : మీకు వేయించిన రవ్వ దొరికితే సరాసరి వంటకి ఉపయోగించుకోవచ్చు మరలా వేయించవలసిన పని లేదు. అలానే రవ్వని నీటిలో వేసే ముందు ఉప్పు రుచి చుసుకోండి. నీరు కొంచెం ఉప్పుగా ఉంటె రవ్వ వేసాక ఉప్పు వేయాల్సిన పని లేదు. 

No comments:

Post a Comment