Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Monday 21 November 2016

beerakaya kura(బీరకాయ కూర)


కావాల్సినవి : బీరకాయ -1/2 కేజీ, పసుపు -1/4 టీస్పూన్, ఉప్పు -1 టీస్పూన్ , ఉల్లిపాయ -1, పచ్చిమిర్చి -2, కారం -1/2 టీస్పూన్, కొత్తిమీర -2 రెమ్మలు, నీళ్లు -1 కప్పు.  
తాలింపు కొరకు : ఆవాలు -1/4 టీస్పూను, జీలకర్ర -1/4 టీస్పూను, పచ్చిపప్పు -1/2 టీస్పూను, ఇంగువ - చిటికెడు ,మినపప్పు -1/2 స్పూన్ ,కరివేపాకు -2 రెమ్మలు, వెల్లులి -2రెబ్బలు, ఎండు మిరపకాయ -2. 





తయారీ : ముందుగా బీరకాయ చెక్కు తీసి సన్నగా ముక్కలు  తరుగుకోవాలి. తరవాత బీరకాయ ముక్కలలో ఉప్పు పసుపు వేసి బాగా  పిసికి పక్కన పెట్టుకోవాలి. కడాయిలో నూనె పోసుకుని వేడిఅయ్యాక తాలింపు సామాను అన్ని వేసుకోవాలి. 




అవి చిటపటలాడాక ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి ఒక నిమిషం వేయించుకోవాలి. తరువాత బీరకాయ ముక్కలు, ఉప్పు మరియు పసుపు వేసి 2 నిమిషాలు వేయించుకోవాలి. కప్పు నీరు పోసి 10 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి.  కూర దగ్గరగా అయ్యాక కారం మరియు కొత్తిమీర వేసి బాగా కలిపి స్టవ్ మీదనుండి దింపుకోవాలి.


    

No comments:

Post a Comment