Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Monday 26 December 2016

califlower bangala dhumpa kura(క్యాలీఫ్లవర్ బంగాళాదుంప కూర)


కావాల్సినవి: క్యాలీఫ్లవర్ ముక్కలు -1 కప్పు, ఉల్లిపాయ -1, బంగాళా దుంపలు -2, పచ్చి మిర్చి -3. టమాటా-3, జీలకర్ర -1 టీస్పూన్, ధనియాల పొడి -1 టీస్పూన్, గరం మసాలా -1 టీస్పూన్, పసుపు -కొద్దిగా, కారం -1 టీస్పూన్, నూనె -2 టేబుల్ స్పూన్స్, కొత్తిమీర -కొద్దిగా, ఉప్పు -తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ -1 టీస్పూన్.


తయారీ: గిన్నెలో నీరు పోసి 1 స్పూన్ ఉప్పు మరియు క్యాలీఫ్లవర్ ముక్కలు వేసి 5 నిమిషాలు ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. తరువాత స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి అది వేడి అయ్యాక జీలకర్ర వేసి వేగించి ,ఉల్లిపాయ ముక్కలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 2 నిమిషాలు పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి.


తరువాత టమాటా ముక్కలు కూడా వేసి ఉప్పు చల్లి 5 నిమిషాలు వేయించుకుని, ధనియాల పొడి, గరం మసాలా, కారం వేసి మరో నిమిషం వేయించి దానిలో బంగాళాదుంప ముక్కలు, ఉడికించి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు వేసి 1/2 గ్లాస్ నీరు పోసి మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి.


చివరగా కొత్తిమీర చల్లి క్రీం తో అలంకరించుకోటమే. ఈ కూర చపాతీ,రోటి మరియు అన్నంతో తినటానికి బాగుంటుంది. 

No comments:

Post a Comment