Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Monday 12 December 2016

Poha , Atukula upma(అటుకుల ఉప్మా(పోహా)


కావాల్సినవి : అటుకులు- 1 కప్పు, పచ్చిమిర్చి- 3, పెద్ద ఉల్లిపాయ- 1/2, వేరుశెనగ పప్పు- 2 టేబుల్ స్పూన్స్ , పచ్చి బఠాణి -3 టేబుల్ స్పూన్స్, క్యారెట్- 1, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు- 3/4 కప్పు(లేకపోయినా పర్లేదు ), ఉప్పు-తగినంత, పచ్చిపప్పు- 1 టేబుల్ స్పూన్, జీలకర్ర- 1/2 టీస్పూన్, వెల్లుల్లి ముక్కలు- 1/2 టీస్పూన్, పసుపు- 1/4 టీస్పూన్, కొత్తిమీర - కొద్దిగా, కరివేపాకు- 2 రెమ్మలు, నిమ్మరసం -2 టేబుల్ స్పూన్స్.


తయారీ: ముందుగా అటుకులని నీళ్లతో శుభ్రం చేసుకొని నీరు లేకుండా పిండి పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని  వేడి అయ్యాక పచ్చిపప్పు, జీలకర్ర, వేరుశెనగ పప్పు, కరివేపాకు వేసి వేగించుకుని దానిలో ఉల్లిపాయ ముక్కలు ,బంగాళాదుంప ముక్కలు, పచ్చి బఠాణి , క్యారెట్ ముక్కలు ,పసుపు, ఉప్పు వేసుకుని మీడియం మంట మీద మూత పెట్టుకుని 5 నిమిషాలు వేయించుకోవాలి.


చివరగా తడిపి పెట్టుకున్న అటుకులని వేసి బాగా కలయపెట్టుకొని ఉప్పు సరిచూసుకుని ,నిమ్మరసం వేసి కలిపి కొత్తిమీర చల్లుకుని  అలంకరించుకోవాలి. (నిమ్మరసం బదులు ఎండు మామిడి పొడి కూడా వేసుకోవచ్చు) అంతే ఎంతో తేలిక అయిన మరియు రుచికరమైన అటుకుల ఉప్మా రెడీ. 

No comments:

Post a Comment