Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Wednesday 7 December 2016

pesarattu(పెసరట్టు)


కావాల్సినవి: పెసర పప్పు -1 కప్పు, బియ్యం -1/2 కప్పు, పచ్చిమిర్చి -3, అల్లం -చిన్న ముక్క, జీలకర్ర -1 టీస్పూన్, ఉప్పు-తగినంత, నూనె -దోశ కాల్చటానికి సరిపడినంత ,ఉల్లిపాయ -1.

తయారీ: ముందుగా పెసర పప్పు ,బియ్యం కలిపి ఒక గిన్నెలో తీసుకుని శుభ్రంగా కడిగి నీరుపోసి 4-6 గంటలు నాన పెట్టుకోవాలి. తరువాత మరలా ఒకసారి శుభ్రంగా కడుక్కుని మిక్సీ జార్ లో వేసుకోవాలి, దానిలో పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి.


ఈ దోశ  పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని, గట్టిగా ఉంటె నీరు పోసుకుని పలచగా చేసుకోవాలి. ఈ పిండిలో జీలకర్ర వేసి ఉప్పు సరిచుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద దోశల పెనం పెట్టుకుని బాగా వేడి అయ్యాక ,గుంట గరిటతో  పిండి తీసుకుని పెనము మీద వేసి గుండ్రంగా తిప్పుతూ దోశలా వేసుకుని ,దాని మీద సన్నగా తరిగిన ఉల్లిపాయలు చల్లుకుని నూనె వేసుకుంటూ రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే పెసరట్టు రెడీ, దీనిని పల్లీ చట్నీ లేక అల్లం చట్నీతో తింటే రుచిగా ఉంటుంది.


గమనిక: పెసరట్టు కొంచెం కరకరలాడుతూ ఇష్టపడే వారు బియ్యం మోతాదు ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. అలానే అల్లం, పచ్చిమిర్చి ముక్కలు మిక్సీ లో వేసుకోకుండా దోశ  వేసాక పైన ఉల్లిపాయలతో పాటు చల్లుకోవచ్చు.


No comments:

Post a Comment