Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Monday 19 December 2016

chana curry/ kaabuli senagala kura,Senagala curry(కాబూలీ సెనగల కూర)


కావాల్సినవి: ఒక రాత్రి అంతా నానపెట్టిన సెనగలు -1పెద్ద కప్పు, బంగాళాదుంప -1, టమాటా  గుజ్జు-1 కప్పు, ఉల్లిపాయ గుజ్జు-1/2 కప్పు, చనా మసాలా-1 టేబుల్ స్పూన్, కొత్తిమీర-తగినంత, ఉప్పు-తగినంత, పసుపు-1/2 టీస్పూన్, ధనియాల పొడి-1 టీస్పూన్, గరం మసాలా-1/2 టీస్పూన్, మిర్చి-2, నూనె-3 టేబుల్ స్పూన్స్, కారం-1/2 టీస్పూన్, జీలకర్ర-1 టీస్పూన్, దాల్చిన చెక్క-చిన్న ముక్క, యాలకులు-2, అల్లం వెల్లుల్లి పేస్టు -1 టేబుల్ స్పూన్.

తయారీ: ముందుగా ప్రెషర్ కుక్కర్ లో సెనగలు మరియు బంగాళాదుంప ముక్కలు  నీరు, పసుపు, ఉప్పు వేసి 5 కూతలు వచ్చే వరకు ఉంచి పక్కన పెట్టి చల్లారనివ్వాలి. కడాయిలో నూనె వేసి వేడి చేసి జీలకర్ర, చెక్క, యాలకులు వేసి వేగాక ఉల్లిపాయ గుజ్జు ,అల్లం వెల్లుల్లి పేస్ట్ , మిర్చి, టమాటా  పేస్ట్ ,ఒక దాని తరువాత ఒకటి వేసుకుని ఉప్పు చల్లుకుని 2 నిమిషాలు పాటు  వేయించుకోవాలి.


తరువాత కారం, చనా మసాలా, ధనియాలపొడి, గరం మసాలా అన్ని వేసి కలిపి మరో 5 నిమిషాలు వేయించుకోవాలి. ముందుగా ఉడికించి పెట్టుకున్న సెనగలు, దుంపలు ఈ మసాలాలో వేసి కలయపెట్టి 2 నిమిషాలు ఉడికించుకోవాలి.


సెనగలు ఉడికించగా మిగిలిన నీరు కూరలో పోసుకుని గరిటతో కొద్దిగా సెనగలని కచ్చా పచ్చాగా  మెదుపుకుని ,కూర దగ్గరికి పడే వరకు ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీర చల్లి వడ్డించుకోవాలి.చపాతీ,రోటి,నాన్ లోకి ఈ  కూర రుచిగా ఉంటుంది. 

No comments:

Post a Comment