Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Tuesday 20 December 2016

menthi kura pappu(మెంతి కూర పప్పు)


కావాల్సినవి : మెంతికూర - 1 కట్ట, కందిపప్పు -1 కప్పు ,పచ్చిమిర్చి -3, కారం- 1టీస్పూన్ ,టమాటా -1, పసుపు -చిటికెడు ,ఉప్పు -1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ -1, చింతపండు - 1/2 నిమ్మకాయ అంత, కొత్తిమీర -2 రెమ్మలు.

తాలింపు కొరకు :  ఆవాలు -1/4 టీస్పూన్ ,జీలకర్ర -1/4 టీస్పూన్ ,పచ్చిపప్పు మరియు మినపప్పు- 1/2 టీస్పూన్ చొప్పున ,ఎండుమిర్చి -2, వెల్లులి రెబ్బలు -3, కరివేపాకు -2 రెమ్మలు, నూనె /నెయ్యి -2 టేబుల్ స్పూన్లు.


తయారీ : ముందుగా కుక్కర్ లో పప్పు వేసి బాగా శుభ్రంచేసుకోవాలి. తరిగిన మెంతికూర, పచ్చిమిర్చి , టమాటా, ఉల్లిపాయ, చింతపండు వేసుకుని రెండు కప్పుల నిళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేదాకా ఉంచాలి.


తరువాత కడాయిలో నూనె పోసి అది వేడెక్కిన తర్వాత తాలింపు సమాన్లు మరియు దంచిన వెలుల్లి వేసుకుని అవి చిటపటలాడిన తర్వాత ఉడికించిన పప్పులో వేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు మరియు కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన మెంతికూర పప్పు తయారు .    


No comments:

Post a Comment