Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Friday 23 December 2016

tamato egg burji(టమాటా ఎగ్ బుర్జీ)


కావాల్సినవి: ఉల్లిపాయలు -2, ఎగ్స్ -4, పచ్చిమిర్చి -3, టమాటా -2, గరం మసాలా -1/2 టీస్పూన్, పసుపు -1/4 టీస్పూన్, పచ్చిపప్పు -1 టీస్పూన్, ఆవాలు -1/4 టీస్పూన్, జీలకర్ర -1/2 టీస్పూన్, ఎండు మిర్చి-2, ఉప్పు -తగినంత, కొత్తిమీర -కొద్దిగా ,కరివేపాకు -2 రెమ్మలు. నూనె -2 టేబుల్ స్పూన్స్.


తయారీ: కడాయి తీసుకుని నూనె పోసి అది వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, ఎండు మిర్చి వేసి వేగాక ఉల్లిపాయలు, పసుపు, కరివేపాకు వేసి 3 నిమిషాలు వేయించుకుని దానిలో టమాటా ముక్కలు కూడా వేసి ఉప్పు, గరం మసాలా వేసి కలిపి 5 నిమిషాలు టమాటా ముక్క మెత్తపడే వరకు వేయించుకోవాలి.


తరువాత కోడిగుడ్లు వేసి 2 నిమిషాలు కలపకుండా అలానే ఉంచి  కారం, కొత్తిమీర చల్లుకుని తరువాత అంతా కలిసేట్టు తిప్పుకుని 10 నిమిషాలు మీడియం మంట మీద ఉంచి ఫ్రై చేసుకోవాలి. అంతే టమాటా ఎగ్ బుర్జీ  సిద్ధం. ఈ కూర రోటి, చపాతీ మరియు అన్నంలోకి తినటానికి బాగుంటుంది. 

No comments:

Post a Comment