Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Friday 23 December 2016

cabbage masala kura(క్యాబేజి మసాలా కూర)


కావాల్సినవి:  తరిగిన క్యాబేజి -1 పెద్ద కప్పు , టమాటా -1, ఉల్లిపాయ -1, పసుపు -1/4 టీస్పూన్ , ఉప్పు - 1/2 టీస్పూన్ , కారం -1/2 టీస్పూన్.

మసాలా కొరకు :  కొబ్బరి - 3 లేక 4 టేబుల్ స్పూన్లు , ధనియాలు -1 టేబుల్ స్పూన్ , లవంగాలు -2, దాల్చిన చెక్క - 1 ఇంచ్ ,యాలకలు -1, అల్లం - 1 ఇంచ్, వెలుల్లి -3 రెబ్బలు.
తాలింపు కొరకు : ఆవాలు -1/4 టీస్పూన్ ,జీలకర్ర -1/4 టీస్పూన్ ,పచ్చిపప్పు మరియు మినపప్పు- 1/2 టీస్పూన్ చొప్పున ,ఎండుమిర్చి -2, కరివేపాకు -2 రెమ్మలు, నూనె /నెయ్యి -2 టేబుల్ స్పూన్లు.


తయారీ : ముందుగా ఒక కడాయి తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని నూనె పోసుకోవాలి .నూనె వేడెక్కిన తర్వాత తాలింపు సామాను వేసి అవి చిటపటలాడిన తరువాత తరిగిన ఉల్లిపాయలు మరియు క్యాబేజి వేసి 3 నిమిషాలు వేయించుకోవాలి.


తరవాత మసాలా వేసి పచ్చి వాసనా పోయేవరకు వేపుకుని టమాటా ముక్కలు వేసి మరియొక 10 నిమిషాలు వేపి చివరిగా కారం చల్లి ఒకసారి కలియబెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ కూర చపాతీ లేక అన్నంలోకి బాగుంటుంది.          

No comments:

Post a Comment