Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Monday 9 January 2017

Mirapakaya bajji(మిరపకాయ బజ్జి)


కావాల్సినవి: బజ్జి మిరపకాయలు-6, సెనగపిండి-3/4 కప్పు, బియ్యం పిండి లేదా మొక్క జొన్న పిండి  -1 లేదా  2 టేబుల్ స్పూన్స్, వాము- 1/2 టీస్పూన్, కారం-1 టీస్పూన్, ఉప్పు-తగినంత, బేకింగ్ సోడా- చిటికెడు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు- కొద్దిగా, కొత్తిమీర-కొద్దిగా, నూనె-డీప్ ఫ్రై కి సరిపడినంత.


తయారీ: ముందుగా ఒక గిన్నెలో సెనగపిండి, వాము, బియ్యం పిండి ,కారం,ఉప్పు, సోడా వేసి కొంచెం, కొంచెం నీరు పోసుకుంటూ జారుగా పిండి బజ్జికి పట్టేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పిండి మరి పలచగా ఐతే మరి కొంత పిండి కలుపుకోవాలి. తరువాత మిరపకాయలని శుభ్రంగా కడిగి నిలువుగా ఘాటు పెట్టుకుని ప్లేట్ లో పెట్టుకోవాలి.


స్టవ్ మీద కడాయి పెట్టుకుని నూనె పోసుకుని వేడి అయ్యాక మిరపకాయలని ఒక్కొకటి తీసుకుని సెనగ పిండి మిశ్రమంలో ముంచుకుని తీసి నూనెలో వేసుకుని బంగారు రంగు వచ్చే వరకు వేయించుకుని టిష్యూ పేపర్ మీదకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత మిరపకాయలని మరలా మధ్యకి నిలువుగా ఘాటు పెట్టుకుని ఉల్లిపాయముక్కలు, కొత్తిమీర, కారం కొద్దిగా చల్లి (నచ్చితే), ఉప్పు, నిమ్మరసం వేసి అలంకరించుకుని అతిధులకు అందించటమే. అంతే వేడి వేడి మిర్చి బజ్జి రెడీ .. 

No comments:

Post a Comment