Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Monday 9 January 2017

Zuccini soup(జుకిని సూప్)


కావాల్సినవి: జుకిని తురుము- కప్పు, వెల్లుల్లి తురుము-1 టేబుల్ స్పూన్, ఆలివ్ ఆయిల్-2 టేబుల్ స్పూన్స్, వెజిటబుల్  స్టాక్- 1 కప్పు, నీరు తగినంత, క్రీం -1/2 కప్పు.

తయారీ: ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ మీద పెట్టి ఆలివ్ ఆయిల్ పోసి వేడి  అయ్యాక వెల్లుల్లి తురుము వేసి 1 నిమిషం పాటు వేయించి, దానిలో జుకిని తురుము కూడా వేసి కలిపి 5 నిమిషాలు మూత పెట్టి మీడియం మంట మీద మగ్గించుకోవాలి.


తరువాత వెజిటబుల్  స్టాక్ కూడా పోసి కలిపి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని, ఎక్కువ అనిపిస్తే మరికొంచెం మంచి నీరు పోసుకుని 5 నిమిషాలు మరిగించుకోవాలి. చివరగా క్రీం కూడా పోసి 2 నిమిషాలు మరిగించుకుని సెర్వింగ్ బౌల్ లోకి తీసుకుని అతిధులకు అందించాలి.

గమనిక: మేము ఇక్కడ వెజిటబుల్ స్టాక్ పొడి 1 టేబుల్ స్పూన్  తీసుకుని నీటిలో కలిపి వాడటం జరిగింది .మీరు పొడి లేక వాటర్ ఏది అయినా వాడుకోవచ్చు. బయట దొరికే ఏ వెజిటబుల్  స్టాక్స్ లో అయినా ఉప్పు ఉంటుంది, కనుక జాగ్రత్తగా చూసుకుని కావాలి అంటే చివరిలో వేసుకుంటే సరిపోతుంది. 

No comments:

Post a Comment