Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Tuesday 28 February 2017

Instant sambar, sambar in cooker,Drumstick sambar (ఇన్స్టెంట్ సాంబార్)


కావాల్సినవి :
  • కందిపప్పు -1 కప్పు 
  • ఉల్లిపాయ -1
  • టమాటాలు -2
  • పచ్చిమిర్చి -3
  • ఉప్పు -తగినంత 
  • సాంబార్ పొడి -1 టీస్పూన్
  • కారంపొడి -1 టీస్పూన్ 
  • పసుపు -చిటికెడు
  • కొత్తిమీర -2 రెమ్మలు 
  • మునక్కాయ -1
తాలింపు కొరకు :
  • నూనె -2 టేబుల్ స్పూన్లు 
  • జీలకర్ర -1/4 టీస్పూన్ 
  • ఆవాలు -1/4 టీస్పూన్ 
  • పచ్చిపప్పు -1/2 టీస్పూన్ 
  • మినపప్పు -1/2 టీస్పూన్ 
  • ఎండుమిర్చి -2
  • వెల్లులి -3 రెబ్బలు 
  • కరివేపాకు -2 రెమ్మలు 
తయారీ :
ముందుగా కుక్కర్ లో కందిపప్పు వేసి కప్పుకు రెండుకప్పుల నీరు పోసి మూడు నుండి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికిచుకోవాలి .


ప్రెషర్ పోయాక అందులో తరిగిన ఉల్లిపాయ , పచ్చిమిర్చి ,టమాటాలు ,మునక్కాయ మరియు చింతపండు  వేసి ఒక విజిల్ వచ్చేవరకు ఉంచి పక్కనపెట్టుకోవాలి . కడాయిలో నూనె పోసి తాలింపు  కొరకు పెట్టుకున్న సామాన్లు  వేసి, అవి చిటపటలాడిన తరువాత ఉడికిన పప్పు లో వేసి కలుపుకోవాలి.


తరువాత 2 కప్పుల నీరు పోసి ఉప్పు ,కారం ,సాంబార్ పొడి ,పసుపు వేసి 10 నిమిషాలు బాగా మరగనివ్వాలి.  చివరగా కొత్తిమీర చల్లుకుని సర్వ్ చేసుకోవడమే.


అంతే మీ ముందు మునక్కాయ పప్పుచారు  సిద్ధం   

Oats upma(ఓట్స్ ఉప్మా)


కావాల్సినవి :

  • ఓట్స్ -1 కప్పు
  • ఉల్లిపాయ -1
  • టమాటా -1
  • క్యారెట్ -1
  • పచ్చిబఠాణి -3 టేబుల్ స్పూన్స్
  • పచ్చిమిర్చి -2
  • నూనె -3 టేబుల్ స్పూన్స్
  • ఆవాలు -3/4 టీ స్పూన్స్
  • మినపప్పు- 1 టీ స్పూన్
  • జీలకర్ర -1/2 టీ స్పూన్
  • వేరుశెనగపప్పు -2 టేబుల్ స్పూన్స్
  • ఎండు మిర్చి -1
  • ఉప్పు -తగినంత
  • నిమ్మరసం -2 టేబుల్ స్పూన్స్
  • కొత్తిమీర -కొద్దిగా

తయారీ:
స్టవ్ మీద గిన్నె పెట్టుకుని నూనె పోసి వేడి అయ్యాక ఆవాలు ,జీలకర్ర ,పచ్చిసెనగపప్పు, వేరుశెనగపప్పు, ఎండుమిర్చి వేసి వేగాక ,ఉల్లిపాయ ముక్కలు ,పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు, పచ్చి బఠాణి వేసి ఉప్పు చల్లి మీడియం మంట మీద 3 నిమిషాలు మగ్గించుకోవాలి.


అవి మగ్గే లోపు వేరే స్టవ్ మీద కడాయి పెట్టుకుని నూనె వెయ్యకుండా ఓట్స్ ని పచ్చి వాసన పోయేలా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి.


 తరువాత ఓట్స్ ని మగ్గుతున్న కూరగాయ ముక్కలు ఉన్న గిన్నెలో వేసి కలిపి, కొద్దీ కొద్దీగా నీరు చల్లుకుంటూ ఓట్స్ మెత్తబడే వరకు ఉంచి, చివరగా కొత్తిమీర, నిమ్మరసం కలుపుకుని ప్లేట్ లోకి తీసుకుని వేడి వేడిగా తింటే ఎంతో రుచిగా ఉంటుంది.


(ఓట్స్ వేసాక మంట తక్కువ లో పెట్టుకుని చేసుకుంటే అడుగు మాడిపోకుండా ఉంటుంది, మరియు ఒకేసారి ఎక్కువ నీరు పోసుకుంటే ఓట్స్ ఉప్మా పొడి పొడిగా రాకుండా ముద్దలా అవుతుంది.)

Friday 24 February 2017

Chakkara pongali/Sweet pongal/Pongal(చక్కర పొంగలి)


కావాల్సినవి:
  • బియ్యం -1 కప్పు 
  • పెసరపప్పు -1/2 కప్పు 
  • పాలు -1/2 లీటర్ 

Monday 20 February 2017

Tomato beans curry, Beans curry(టమాటా బీన్స్ కర్రీ)


కావాల్సినవి:
  • బీన్స్ -3/4కేజీ 
  • టమాటా -3
  • ఉల్లిపాయ -1
  • పచ్చిమిర్చి -2
  • కారం -1/2 టీస్పూన్

Tomato pappu/Tomato dal/Andhra style tomato dal(టమాటా పప్పు)


కావాల్సినవి :
  • కందిపప్పు -1కప్పు,
  • టమాటాలు -4 పెద్దవి,
  • ఉల్లిపాయ -1

Wednesday 15 February 2017

Middle east chicken kebab(మిడిల్ఈస్ట్ చికెన్ కబాబ్)


కావాల్సినవి :

  • బోన్ లెస్ చికెన్ - 1/2 కేజీ 
  • పెరుగు -1/2 కప్పు 
  • ఫ్రెష్ క్రీం - 3 టేబుల్ స్పూన్స్ 
  • వెల్లులి -2 రెబ్బలు 
  • ఉప్పు - తగినంత 
  • నిమ్మకాయ - 1 టీస్పూన్ 
  • గరంమసాలా -1 టీస్పూన్
  • కుంకుమ పువ్వు - 1/4 టీస్పూన్ 
  • గుడ్డు -1
  • ఉల్లిపాయ -1
  • నూనె -2 టేబుల్ స్పూన్లు 
తయారీ :
ముందుగా ఒక గిన్నెలో చికెన్ ముక్కలు ,పెరుగు ,ఫ్రెష్ క్రీం ,సన్నగా తరిగిన వెల్లులి ముక్కలు ,ఉప్పు ,నిమ్మకాయ , గరంమసాలా ,కుంకుమ పువ్వు ,నూనె ,మరియు గుడ్డు వేసి బాగా కలుపుకుని 2 నుండి 4 గంటలు మ్యారినేట్ చేసుకోవాలి .




తరువాత చువ్వకి చికెన్ ముక్కలు మరియు పెద్దగా తరిగిన ఉల్లిపాయ ముక్కలని గుచ్చుకుని ఒవేన్ లో 200 డిగ్రీల మీద గ్రిల్ చేసుకోవాలి. ఒక పక్క బాగా గ్రిల్ అయినా తరువాత ఇంకో పక్కకు తిప్పి గ్రిల్ చేసుకోవాలి.. అంతే మీ ముందు చికెన్ కబాబ్ సిద్ధం.


 

Friday 10 February 2017

Hyderabad dum biriyani(హైదరాబాదీ చికెన్ ధమ్ బిరియాని)


కావాల్సినవి :
  • బాస్మతి రైస్ - 1/2 కేజీ 
  • చికెన్ - 3/4 కేజీ లేక 1/2 కేజీ 
  • పసుపు - 1/4 టీస్పూన్ 
  • కారం -1 టీస్పూన్ 
  • ధనియాల పొడి - 1/2 టీస్పూన్ 
  • జీలకర్ర పొడి - 1/4 టీస్పూన్
  • ఉప్పు -తగినంత 
  • బిరియాని మసాలా పొడి / గరం మసాలా -1 టీస్పూన్ 
  • బిరియాని ఆకు - 3
  • యాలకలు -3
  • లవంగాలు -4
  • చెక్క - 2 ఇంచులు 
  • జాజికాయ -2
  • జావిత్రి -1
  • అనాస పువ్వు -2
  • అల్లం వెల్లులి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్ 
  • నిమ్మకాయ రసం - 1 టేబుల్ స్పూన్
  • పెరుగు - 1/2 కప్పు 
  • నూనె / నెయ్యి - 4 టేబుల్ స్పూన్లు 
  • కొత్తిమీర -2 రెమ్మలు 
  • పుదీనా -2 రెమ్మలు
  • పచ్చిమిర్చి -2
  • ఉల్లిపాయలు -1
  • జీడిపప్పులు -15
  • కుంకుమ పువ్వు -2 రేకులు 
  • పాలు -1 టేబుల్ స్పూన్ 
తయారీ :
ముందుగా చికెన్ ని శుభ్రం చేసుకుని పసుపు ,కారం ,ధనియాల పొడి ,జిలకర్ర పొడి, ఉప్పు , బిరియాని మసాలా పొడి / గరం మసాలా ,బిరియాని ఆకు ,యాలకలు ,లవంగాలు ,చెక్క , జాజికాయ ,జావిత్రి ,అనాస పువ్వు ,అల్లం వెల్లులి పేస్ట్ ,నిమ్మకాయ రసం ,పెరుగు ,నూనె / నెయ్యి 2 స్పూన్లు ,తరిగిన కొత్తిమీర ,పుదీనా మరియు పచ్చిమిర్చి వేసి బాగా కలిపి 1 గంట పక్కన పెట్టుకోవాలి. కుంకుమ పువ్వుని పాలలో వేసి పక్కనపెట్టుకోవాలి.




బాస్మతి బియ్యం లో నీళ్లు పోసి 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. రెండు స్పూన్లు నూనె లేక నెయ్యి వేసి ఉల్లిపాయని ఎర్రగా వేపుకుని పక్కన పెట్టుకుని, జీడిపప్పుని ఎర్రగా వేపి పాకాన పెట్టుకోవాలి.


నానబెట్టిన బియ్యంలో కొద్దిగా ఉప్పు నూనె మసాలా సామాను వేసి 75% ఉడికించుకుని నీళ్లు వడకట్టి ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ మీద వేసి వేయించిన ఉల్లిపాయలు ,జీడిపప్పు మరియు కుంకుమపూవు పాలు వేసి మైదా పిండిని మూత చుట్టూ పెట్టి ,గిన్నె మీద మూత గట్టిగా పెట్టాలి.





గిన్నె ని హై మంట మీద ఒక నిమిషం ఉంచి ,మిడిముమ్ మీద 3 నిమిషాలు ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ మీద పెనం (ఇలా చేయడం వల్ల మసాలా మాడకుండా ఉంటుంది) పెట్టుకుని దాని మీద గిన్నెని ఉంచి 10 నిమిషాలు స్లో మంట మీద ఉడికించి పక్కన పెట్టుకోవాలి .తర్వాత మైదా పిండి సీల్ ఓపెన్ చేసి అంత ఒకసారి కలుపుకుని సర్వ్ చేసుకోవాలి.  








Tuesday 7 February 2017

Egg korma / Kodi guddu korma (ఎగ్ కుర్మా)


కావాల్సినవి:
ఉడికించిన కోడి గుడ్లు -2, పెద్ద ఉల్లిపాయ -1, టమాటా గుజ్జు -1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ -1 టేబుల్ స్పూన్, పచ్చి కొబ్బరి ముక్కలు -3 టేబుల్ స్పూన్స్, నాన పెట్టిన జీడీ పప్పు -10, నూనె -3 టేబుల్ స్పూన్స్, జీలకర్ర -1 టీస్పూన్, దలచిన చెక్క -కొద్దిగా, బిర్యానీ ఆకు -1, లవంగాలు -3, పసుపు -కొద్దిగా, గరం మసాలా -1 టీస్పూన్, కారం -1 టీస్పూన్, ధనియాల పొడి -1 టీస్పూన్, ఉప్పు -తగినంత, కొత్తిమీర -కొద్దిగా.

తయారీముందుగా కడాయిలో 1 స్పూన్ నూనె వేసి వేడి అయ్యాక చిటికెడు పసుపు వేసి దానిలో ముందుగా ఉడికించి పెట్టుకున్న కోడి గుడ్లు వేసి 2 నిమిషాలు కొద్దిగా ఎర్రగా అయ్యేలా వెంచుకుని వాటి మీద ఉప్పు, కారం చల్లుకుని పక్కన పెట్టుకోవాలి.



తరువాత మిక్సీలో పచ్చి కొబ్బరి ముక్కలు, జీడిపప్పు వేసి మెత్తగా ముద్దగా చేసుకుని పక్కన పెట్టుకోండి. కడాయిలో మిగిలిన నూనె వేసి వేడి అయ్యాక జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, పసుపు  వేసి ఓక నిమిషం వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తరువాత అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి.


తరువాత టమాటా గుజ్జు వేసి ఉప్పు చల్లుకుని 3 నిమిషాలు ఉడికించుకోవాలి. కొబ్బరి జీడీ పప్పు పేస్ట్ వేసి బాగా కలుపుకుని మరో 5 నిమిషాలు మగ్గించుకోవాలి. తరువాత కారం ,ధనియాలపొడి, గరంమసాలా వేసి కలిపి 1/2 గ్లాస్ నీరు పోసి నూనె బయటికి వచ్చే వరకు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి.


 చివరగా కొత్తిమీర వేసుకుని ముందుగా వేయించి పెట్టుకున్న గుడ్లు మీద ఈ కూర వేసుకుని అతిథులకు  వడ్డించాలి. ఈ కూర అన్నం, చపాతీ, రోటీలోకి రుచిగా ఉంటుంది. (గుడ్లును  కూరలో వేసి కూడా ఉడికించుకోవచ్చు)

Telangana style mutton curry/Spicy Mutton curry(తెలంగాణ మటన్ కూర)


కావాల్సినవి :

  • మటన్ - 1/2 కేజీ 
  • ఉల్లిపాయలు - 1
  • పచ్చిమిర్చి -2
  • కరివేపాకు -1 రెమ్మ 
  • కొత్తిమీర -2 రెమ్మలు 
  • పుదీనా - 1 రెమ్మ 
  • గరంమసాలా - 1టీస్పూన్ 
  • జీలకర్ర పొడి - 1/4 టీస్పూన్ 
  • ధనియాలపొడి - 1/2 టీస్పూన్ 
  • ఎండు కొబ్బరి పొడి -3 టేబుల్ స్పూన్లు 
  • మిరియాలు -1/2 టీస్పూన్ 
  • బిరియాని ఆకు - 2
  • చెక్క -2 ఇంచులు 
  • యాలకలు -2
  • లవంగాలు -2
  • సోపు గింజెలు - 1/2 టీస్పూన్ 
  • అల్లం వెల్లులి ముద్ద- 1 టీస్పూన్ 
  • పసుపు - చిటికెడు 
  • కారం - 1 టీస్పూన్ 
  • నూనె -2 టేబుల్ స్పూన్లు 
  • ఉప్పు -తగినంత (1 టీస్పూన్)
తయారీ :
ముందుగా కుక్కర్ ని స్టవ్ మీద పెట్టుకుని నూనె పోసుకోవాలి అది వేడెక్కినా తర్వాత కరివేపాకు ,బిరియాని ఆకు ,చెక్క ,యాలకలు ,సోపు గింజలు, లవంగాలు మరియు మరియాలు వేసి ఒక నిమిషం వేపిన తరువాత ఉల్లిపాయ మరియు పచ్చిమిర్చి వేసి కొద్దిగా ఒక నిమిషం వేపిన తరువాత అల్లం వెల్లులి ముద్ద వేయాలి.



అల్లం వెల్లులిని పచ్చి వాసన పోయేవరకు వేపుకుని మటన్ ముక్కలు వేయాలి. తర్వాత ఉప్పు ,పసుపు ,ధనియాల పొడి ,జీలకర్ర పొడి వేసి 1 కప్పు (200 ml) నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి మీడియం మంట మీద మూడు విజిల్స్ వచ్చేదాక ఉడికించుకోవాలి.



తరువాత కుక్కర్ మూత తీసి గరంమసాలా, కారం ,కొబ్బరి పొడి వేసి కూర దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. చివరిగా కొత్తిమీర మరియు పుదీనా వేసి సర్వ్ చేసుకోడమే .అంతే మీ ముందు రుచికరమైన మటన్ కూర తయారు.




Friday 3 February 2017

Semiya payasam / Nuts payasam/ Kheer (సేమియా పాయసం)



For recipe in english

కావల్సినవి :
  • సేమియా - 1/2 కప్పు 
  • పంచదార -1/2 కప్పు 
  • నెయ్యి -3 టేబుల్ స్పూన్లు 

Thursday 2 February 2017

Black eyed peas curry( అలసందల కూర)


కావాల్సినవి: 
  • అలసందలు -1కప్పు,
  • ఉల్లిపాయ -1,
  • పచ్చిమిర్చి -2,
  • టమాటా ముక్కలు -1 కప్పు,
  • బంగాళాదుంప -1,
  • కారం -1 టీస్పూన్,
  • ఉప్పు -తగినంత,
  • ధనియాల పొడి -1 టీస్పూన్,
  • గరంమసాలా -1 టీస్పూన్,
  •  పావ్ బాజీ మసాలా -1 టీస్పూన్(optional)
  • కొత్తిమీర -కొద్దిగ
  • వెల్లుల్లి రెబ్బలు -2
  • కరివేపాకు -2 రెమ్మలు 
  • జీల కర్ర -1/2 టీస్పూన్ 
  • నూనె/బటర్ -3 టేబుల్ స్పూన్స్. 

తయారీ: బొబ్బర్లని శుభ్రంగా కడిగి నీరు పోసి ఒక రాత్రి అంతా లేదా 7 నుంచి 8 గంటలు నాన పెట్టుకుని పక్కన పెట్టుకోండి. కుక్కర్ లో నానపెట్టుకున్న బొబ్బర్లు ,బంగాళాదుంప ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, ఒక పెద్ద గ్లాస్ నీరు పోసి 4 కూతలు వచ్చే వరకు ఉంచి, పక్కన పెట్టుకుని ఆవిరి  పోయిన తరువాత గరిటతో కచ్చా పచ్చగా మెదుపుకుని కారం, పావ్ బాజీ మసాలా వేసి కలిపి, గట్టిగా ఉంటె మరి కొంచెం నీరు పోసి ఉడికించుకుంటూ ఉండాలి.


తరువాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని నూనె లేదా బటర్ వేసుకుని వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర, అల్లం ముక్కలు, వెల్లుల్లి, కరివేపాకు, పసుపు వేసి వేగాక, ఉడుకుతున్న అలసందలు  కూరలో వేసి కలుపుకుని సెర్వింగ్ బౌల్ లోకి తీసుకుని నిమ్మరసం, కొత్తిమీర, మిక్సర్ వేసి వడ్డించుకోవాలి. ఈ కూర చపాతీ, రోటి, రైస్ మరియు చాట్ లాగ తినటానికి రుచిగా ఉంటుంది.