Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Monday 27 March 2017

Andhra style carrot pickle,carrot avakaya (క్యారెట్ పచ్చడి )

క్యారెట్ పచ్చడి



కావాల్సినవి :

  • సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు-1 కప్పు
  • కారం-2 టేబుల్ స్పూన్స్
  • ఉప్పు-2 టేబుల్ స్పూన్స్
  • మెంతి పొడి-3/4 టీ స్పూన్
  • ఆవపిండి-1/2 టీ స్పూన్
  • నిమ్మరసం-తగినంత
  • నూనె-5 టేబుల్ స్పూన్స్
  • ఆవాలు-1 టీ స్పూన్
  • పచ్చి సెనగపప్పు-1 టీ స్పూన్
  • జీలకర్ర-1 టీ స్పూన్
  • కరివేపాకు-2 రెమ్మలు
  • వెల్లుల్లి-2రెబ్బలు
తయారీ:తరిగిన క్యారెట్ ముక్కలని ఒక గిన్నెలోకి తీసుకుని దానిలో కారం, ఉప్పు, మెంతిపిండి, ఆవపిండి వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.


తరువాత కడాయిలో నూనె వేసుకుని వేడి అయ్యాక ఆవాలు, పచ్చిపప్పు, జీలకర్ర, కరివేపాకు, దంచిన వెల్లుల్లు రెబ్బలు వేసుకుని వేగాక, ముందుగా కలిపి పెట్టుకున్న క్యారెట్ ముక్కాల మీద వేసి బాగా కలయ పెట్టి చివరగా నిమ్మరసం కూడా వేసి కలుపుకుని సీసాలోకి తీసుకుని నిల్వ చేసుకోవచ్చు.


ఈ  పచ్చడి పుల్లగా,క్యారెట్ ముక్క  కరకర లాడుతూ చాల రుచిగా ఉంటుంది. అన్నం ,దోసలోకి ఈ పచ్చడి రుచిగా  ఉంటుంది మరియు 15 రోజులవరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవచ్చు.


నోట్ : మెంతి పిండి కోసం కొద్దిగా మెంతులని తీసుకుని కడాయిలో నూనె లేకుండా వేడి చేసుకుని, మిక్సీ లో వేసుకుని మెత్తగా పొడి చేసుకుని నిల్వ చేసుకుంటే అన్ని పచ్చడులలోకి వాడుకోవచ్చు.
అలానే ఆవ పిండి కోసం ఆవాలని (వేయించనవసరం లేదు) మిక్సీ లో వేసి మెత్తగా పొడి చేసుకుంటే సరిపోతుంది. మార్కెట్ లో కూడా ఆవ  మరియు మెంతి పొడులు  మనకి అందుబాటులో ఉంటున్నాయి కనుక మీకు నచ్చినది ఉపయోగించవచ్చు. 

Golibaje, Andhra style challa punugulu, Maida punugulu

గోలి బాజే ,చల్ల పునుగులు , మైదా పునుగులు


కావాల్సినవి :
  • మైదా పిండి - 1 కప్పు 
  • పచ్చిమిర్చి -4

Saturday 25 March 2017

Fish fry (ఫిష్ ఫ్రై /చేపల వేపుడు/Chepala vepudu)


కావాల్సినవి :
  • చేపలు -1/2 కేజీ 
  • కారం -2 టీస్పూన్స్ 
  • ఉప్పు- తగినంత 
  • నిమ్మరసం - 1.1/2 టీస్పూన్స్ 
  • అల్లంవెల్లులి ముద్ద- 1 టీస్పూన్ 
  • మిరియాలపొడి - 1/2 టీస్పూన్ 
  • ధనియాలపొడి -1 టీస్పూన్ 
  • మైదా -3 టేబుల్ స్పూన్లు 
  • కార్న్ ఫ్లోర్ -1 టేబుల్ స్పూన్ 
  • నూనె - 1/2 కప్పు లేక వేపుడికి తగినంత 
తయారీ :
ఒక గిన్నె లో నూనె తప్ప మిగిలినవన్నీ వేసి బాగా కలిపి గంట సేపు మారినాటే చేసుకోవాలి. 


తరువాత కడాయి లో నూనె పోసి అది వేడెక్కిన తరువాత చేప ముక్కలు వేసి దోరగా వేపుకోవాలి. 



అంతే రుచికరమైన ఫిష్ ఫ్రై సిద్ధం.    

Tuesday 21 March 2017

Broccoli soup (బ్రోకలీ సూప్)


కావాల్సినవి :
  • బ్రోకలీ -1
  • వెల్లులి -1

Brinjal potato curry(వంకాయ బంగాళాదుంప కూర)


కావాల్సినవి:

  • వంకాయలు ముక్కలు-1 కప్పు(4 వంకాయలు),
  • బంగాళాదుంప ముక్కలు -1 చిన్న కప్పు(1 పెద్ద దుంప),

Wednesday 15 March 2017

Mutton fry , Andhra style Mutton fry (మటన్ ఫ్రై)


కావాల్సినవి :
మటన్-1/2 కేజీ ,ఉల్లిపాయ-1, పచ్చిమిర్చి-2, జీలకర్ర-1 టీస్పూన్, అల్లం వెల్లుల్లి ముద్ద -2 టేబుల్ స్పూన్స్, గరం మసాలా-1 టేబుల్ స్పూన్, నూనె-3 టేబుల్ స్పూన్స్, దాల్చిన చెక్క-కొద్దిగా, లవంగాలు-4, ఉప్పు-తగినంత, పసుపు-1/2 టీ స్పూన్, యాలకులు-2, కారం-1టీస్పూన్ .

తయారీ:
ముందుగా మటన్ ని చిన్న ముక్కలుగా కోసుకుని ఉప్పు పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద కొద్దిగా , కారం, నూనె, యాలకులు, దాల్చిన చెక్క చిన్న ముక్క వేసుకుని బాగాకలిపి ఒక గంట ఫ్రిడ్జిలో పెట్టుకుని తరువాత ప్రెషర్ కుక్కర్ లో వేసి 1కప్పు నీరు పోసి 3కూతలు వచ్చేవరకు ఉంచి పక్కన పెట్టుకోవాలి.


తరువాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని నూనె వేసి వేడి అయ్యాక జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు వేసి వేగాక ఉల్లిపాయ, పచ్చి మిర్చి ముక్కలు,మిగిలిన అల్లం వెల్లుల్లి ముద్ద వేసి 2 నిమిషాలు వేయించుకుని ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ ని



మరియు ఉడికించగా  మిగిలిన నీటిని కూడా వేసుకుని ,గరం మసాలా వేసుకుని కలిపి, మూత పెట్టకుండా  నీరు అంతా ఆవిరి అయ్యే వరకు ఉడికించి కూర దగ్గరికి పడినప్పుడు కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని గిన్నెలోకి తీసి వడ్డించుకోవాలి.

నోట్:మటన్ ముదురుగా ఉన్నదీ అయితే 4 కూతలా వచ్చే వరకు ఉంచండి అప్పుడే మటన్ బాగా ఉడుకుతుంది. ఉప్పు,కారం,మసాలా ఘాటు మీ రుచికి తగినట్టుగా వేసుకోగలరు. 

Strawberry ginger freshness(స్ట్రాబెర్రీ జింజర్ ఫ్రెషన్స్)


కావాల్సినవి :
  • స్ట్రాబెర్రిస్ -1/4 కేజీ 
  • అల్లం ముక్కలు -1/4 టీస్పూన్ 
  • పంచదార - 2 టేబుల్ స్పూన్లు
  • నీళ్లు -1. 1/2 కప్పులు 
తయారీ :
మిక్సీ జార్ లో స్ట్రాబెర్రిస్, అల్లం ముక్కలు ,పంచదార మరియు నీళ్లు వేసి 1 నిమిషం మిక్సీ పట్టుకోవాలి. గ్లాసులొకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే .



అంతే ఎంతో తేలిక అయిన స్ట్రాబెర్రీ జింజర్ ఫ్రెషన్స్ తయారు. వేసవి కాలంలో చల్లగా ఈ జ్యూస్ తాగడం వల్ల తక్షణంమే ఎండ తపన నుండి విముక్తినిస్తుంది.  

Mamidikaya mukkala pachadi / Mango chutney(మామిడికాయ ముక్కాల పచ్చడి)


కావాల్సినవి :

  • పచ్చిమామిడికాయ -1
  • కారం -1 టీస్పూన్ 
  • ఉప్పు - తగినంత (1/2 టీస్పూన్)
  • పసుపు -చిటికెడు 
తాలింపు కొరకు :

  • నూనె -3 టేబుల్ స్పూన్లు 
  • జీలకర్ర -1/4 టీస్పూన్ 
  • ఆవాలు -1/4 టీస్పూన్ 
  • పచ్చిపప్పు -1 టీస్పూన్ 
  • వెలుల్లి -5 రెబ్బలు 
  • ఇంగువ -చిటికెడు 
  • కరివేపాకు -2 రెమ్మలు 
తయారీ :
ముందుగా మామిడియాను సన్నని ముక్కలుగా కోసుకుని అందులో ఉప్పు కారం మరియు పసుపు వేసి కలుపుకోవాలి .



తరువాత ఒక కడాయి తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత తాలింపు కొరకు పెట్టుకున్న సామాను మరియు కచ్చాపచ్చాగా దంచిన వెల్లులిని వేసుకోవాలి అవి వేగిన తరువాత స్టవ్ ఆపుకుని మామిడికాయ ముక్కలని వేసి కలుపుకోవాలి.



అంతే  తేలికయిన మామిడికాయ ముక్కాలా పచ్చడి సిద్ధం. 

Thursday 9 March 2017

Beerakaya senagapappu kura/Ridge gourd curry(బీరకాయ సెనగపప్పు కూర)


కావాల్సినవి :
  • బీరకాయ -1
  • ఉల్లిపాయ -1
  • పచ్చిమిర్చి -3
  • నానబెట్టిన పచ్చి శెనగపప్పు -1/2 కప్పు 
  • కారం -1 టీస్పూన్ 
  • ఉప్పు -తగినంత 
  • పసుపు -1/4 టీస్పూన్ 
  • టమాటా-1
  • కొత్తిమీర -2 రెమ్మలు 
తాలింపు కొరకు :
  • నూనె -2 టేబుల్ స్పూన్లు 
  • ఆవాలు - 1/4 టీస్పూన్ 
  • జీలకర్ర -1/4 టీస్పూన్ 
  • మినపప్పు -1 టీస్పూన్ 
  • ఎండుమిర్చి -2
  • కరివేపాకు -1 రెమ్మ 
  • వెల్లులి -2 రెబ్బలు 
తయారీ :
ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని నూనె పోసి కొంచెం వేడెక్కిన తర్వాత తాలింపు కొరకు పెట్టుకున్న సామాను వేసి అవి చిటపటలాడిన తరవాత తరిగిన ఉల్లిపాయ మరియు పచ్చిమిర్చి వేసి 2 నిమిషాలు మగ్గించుకోవాలి.


తరువాత తరిగిన బీరకాయ మరియు సెనగపప్పు వేసుకుని మరియొక రెండు నిమిషాల మగ్గించుకోవాలి.


టమాటా ముక్కలు వేసి ఉప్పు ,పసుపు మరియు కప్పు నీరు పోసి 10 నిముషాలు ఉడికించుకోవాలి.


చివరిగా కారం మరియు కొత్తిమీర చల్లుకుని 2 నిమిషాలు మగ్గించుకోవాలి. అంతే మీ ముందు బీరకాయ సెనగపప్పు కూర సిద్ధం .      

Ragi mudda/Ragi sankati/Ragi ball(రాగి ముద్ద)


కావాల్సినవి:
  • రాగి పిండి - 1 కప్పు 
  • ఉప్పు - తగినంత (1/2 టీస్పూన్)
  • అన్నం - 1/2 కప్పు 
తయారీ:
అన్నంలో 21/2 కప్పుల నీరు పోసి బాగా మరిగించుకోవాలి. అందులో కొద్దిగా ఉప్పు వేసి కొద్ది కొద్దిగా రాగి పిండి వేస్తూ గట్టి పడే వరకు కలుపుతూ ఉండాలి .




తరువాత స్టవ్ మీద నుండి దించుకుని వేడి పోక ముందే చేతులు తడి చేసుకుని ఉండలు చుట్టుకోవాలి. రాగి ముద్ద చికెన్ కూర తో చాల రుచిగా ఉంటుంది.

Tuesday 7 March 2017

Bangaladumpa tomato curry/Potato tomato curry/Aloo tomato curry(బంగాళాదుంప టమాటా కూర)


కావాల్సినవి
  • సన్నగా తరిగిన దుంపలు-1 కప్పు,
  • టమాటాలు-1 కప్పు,
  • పచ్చి మిర్చి-2,
  • గరం మసాలా-1/2 టీస్పూన్,
  • నూనె-3 టేబుల్ స్పూన్స్,
  • ఆవాలు-3/4 టీస్పూన్,
  • ఎండు మిర్చి-2,
  • జీలకర్ర-1/2 టీస్పూన్, 
  • పచ్చి సెనగ పప్పు-1/2 టీస్పూన్,
  • ఉల్లిపాయ-1,
  • అల్లంవెల్లుల్లి ముద్ద -1 టీస్పూన్ ,
  • కరివేపాకు-2రెమ్మలు,
  • ఉప్పు-తగినంత,
  • కారం-1 టీస్పూన్.
తయారీ:
స్టవ్ మీద గిన్నె పెట్టుకుని నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చి సెనగ పప్పు, కరివేపాకు, ఎండు మిర్చి వేసి వేగాక ఉల్లిపాయ ముక్కలు ,పచ్చిమిర్చి, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి 2 నిమిషాలు వేయించుకుని బంగాళాదుంప ముక్కలు వేసుకోవాలి .



ఉప్పు చల్లి మూత  పెట్టుకుని 3 నిమిషాలు మగ్గించుకున్న తరువాత టమాటా ముక్కలు, కారం, గరం మసాలా వేసి కలిపి ,ఒక కప్పు నీరు పోసుకుని 10 నిమిషాలు కూర దగ్గరికి పడే వరకు ఉడికించుకోవాలి. అంతే బంగాళాదుంప టమాటా కూర సిద్ధం.


ఈ కూర అన్నం,చపాతీ, రోటీలోకి రుచిగా ఉంటుంది. 

Cabbage chutney,Cabbage roti pachadi(క్యాబేజీ పచ్చడి)


కావాల్సినవి:
  • తరిగిన క్యాబేజీ-1 పెద్ద కప్పు,
  • పచ్చి మిర్చి-7,
  • టమాటా ముక్కలు- 1 చిన్న కప్పు,
  • నూనె-4 టేబుల్ స్పూన్స్,

Friday 3 March 2017

Garelu / Vada/ Medhu vada / Urad dal vada / Minapa Garelu (గారెలు)


కావాల్సినవి :
  • మినపప్పు -1 కప్పు 
  • ఉల్లిపాయ -1
  • పచ్చిమిర్చి -4

Bread upma(బ్రెడ్ ఉప్మా)


కావాల్సినవి :

  • వైట్ బ్రెడ్ లేదా బ్రౌన్ బ్రెడ్ స్లైసులు - 5
  • వేరుశెనక పప్పులు -1 టేబుల్ స్పూన్
  • జీల కర్ర -1/2 టీస్పూన్