Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Friday 3 March 2017

Garelu / Vada/ Medhu vada / Urad dal vada / Minapa Garelu (గారెలు)


కావాల్సినవి :
  • మినపప్పు -1 కప్పు 
  • ఉల్లిపాయ -1
  • పచ్చిమిర్చి -4
  • అల్లం ముక్క - 1 ఇంచ్ 
  • జీలకర్ర - 1/2 టీస్పూన్ 
  • కరివేపాకు -2 రెమ్మలు 
  • కొత్తిమీర -2 రెమ్మలు 
  • ఉప్పు - తగినంత 
  • నూనె - డీప్ ఫ్రై కి సరిపడినంత 
తయారీ : మినపప్పుని శుభ్రంగా కడిగి 6 గంటలు నానబెట్టుకోవాలి .మిక్సీ జార్ లో నానిన మినపప్పు ,ఉప్పు ,2 పచ్చిమిర్చి మరియు అల్లం ముక్కలు వేసి కొద్దిగా నీరు పోసి మిక్సీ వేసుకోవాలి (నీరు మరి ఎక్కువ పోసుకుంటే నూనె ఎక్కువ పీలుస్తుంది).


పిండిలో తరిగిన ఉల్లిపాయ ,పచ్చిమిర్చి ,కరివేపాకు ,కొత్తిమీర మరియు జీలకర్ర వేసి కలుపుకోవాలి .స్టీవ్ మీద కడాయి పెట్టుకుని నూనె పోసుకుని మిడియం మంట మీద నూనె కాగనివ్వాలి.



తరువాత చెయ్యి తడి చేసుకుని పిండి ముద్ద తీసుకుని గుండ్రంగా వత్తుకుని మధ్యలో రంద్రం పెట్టి నునేలో వేసి రెండు వైపులా తిప్పుతూ ఎర్రగా  వేపుకోవాలి. అంతే మీ ముందు ఘుమఘుమ లాడే గారెలు సిద్ధం.


No comments:

Post a Comment