Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Wednesday 12 October 2016

Brussels (Belgium) Travel info

అందమైన పార్కులు, ఉద్యానవనములు, పెద్ద పెద్ద భవనాలు మరియు చర్చిలు ఉన్నటువంటి ప్రశాంతమైన బ్రుస్సేల్స్ నగరమును మేము సందర్శించినప్పటి మా అనుభూతులు ఈరోజు మీకు తెలియచేయదలిచాం. బ్రుస్సేల్స్ సిటీ బెలీజియం దేశం యొక్క రాజదాని. ఇది మెట్రోపాలిటన్ నగరం. మొత్తం జనాభా 1. 2 మిలియన్. జర్మనీ లో ఉన్న ఫ్రాంక్ఫర్ట్ నగరం నుండి 4 గంటలు కారు ప్రయాణం చేసి మేము బసచేసే హోటలుకి చేరుకున్నాము. అక్కడ మా సామాను లోపల పెట్టుకుని పర్యటనకి బయలుదేరాము. మొదటి రోజు మేము బ్రుస్సేల్స్ నగర పర్యటన చేయదలచి, ఒక్కరోజు బస్సు పాస్ కొనుగోలు చేసాము. హాప్-ఆన్ హాప్-ఆఫ్ ఎయిర్ వాళ్ళు ఈ బస్సులను నడుపుతున్నారు .ఇవి ఓపెన్ టాప్ బస్సులు అవ్వటం వలన నగరాన్ని కనులకి కట్టినట్టు చూడవచ్చు.

చర్చి 

ఈ బస్సులు మనల్ని ముఖ్యమైన సందర్శన స్థలముల దగ్గరకి తీసుకువెళ్తాయి .సెంట్రల్ రైల్వే స్టేషన్ నుండి ఈ బస్సులు మొదలవుతాయి. ప్రతి అరగంటకి ఒక బస్సు ఉండటం వలన మనం చూడదలిచిన ప్రదేశంవద్ద దిగి, మళ్ళి తర్వాత వచ్చే బస్సులో వేరే ప్రదేశానికి  వేళ్ళవచ్చు.

ఆటోమియం 
ముఖ్య ప్రదేశాలు అయిన ఆటోమియం, cinquantenaire , గ్రాండ్ ప్లేస్, మన్నెంకేన్  పిస్ ,పార్లమెంటేరియంని సందర్శించాము. పార్లమెంట్ బిల్డింగుని చూసిన వెంటనే మార్చి 2016 లో జరిగిన ఉగ్రదాడి గుర్తువచ్చి మనసుకి చాలా బాధ అనిపించింది . నగరమంతా ఎక్కడ చూసిన భద్రతాదళాలు పహారా ఉండటం చూసాము .


పార్లమెంట్ 
రెండవ రోజు మేము హుజీ కెంపెన్ నేషనల్ పార్కుకి వెళ్ళాము. ఇది మొత్తము 57 కిలోమీటర్లు విస్తరించి ఉంది . దాదాపు 20 కిలోమీటర్లు వరకు ట్రేక్కింగ్ చేసాము. తర్వాత రోజు మేము రాయల్ మ్యూజియం ఆఫ్ ఆర్మడ్ ఫోర్సెస్ కి వెళ్ళాము. అక్కడ వివిధ జంతువుల శిలాజాలు భద్ర పరిచిన విదానం మమ్ములను ఎంతగానో ఆకట్టుకుంది. 


మ్యూజియం 
మరుసటి రోజు గ్రోట్టేస్ అని పిలవబడే గుహలను చూడటానికి వెళ్ళాము. అక్కడ మేము పొందిన అనుభూతి మాటల్లో చెప్పలేనిది. ప్రతి 15 మందికి కలిపి ఒక గైడ్ ని ఇచ్చారు, అతను ఆ గుహ యొక్క విశేషాలని మాకు క్లుప్తంగా వివరిచాడు. ఒక కిలోమీటరు నడక తరువాత మేము గుహ యొక్క క్రింది భాగానికి చేరుకున్నాము .అక్కడ ఒక చిన్న కాలువ దగ్గర ఉన్న పడవల్లో మమ్ముల్ని ఎక్కించుకుని 30 నిమిషముల పాటు గుహ అడుగుబాగం చూపించారు .ఆ ప్రదేశమంతా బాగా చీకటిగా ఉంది, అక్కడ అక్కడ కొన్ని దీపాలు మాత్రమే ఉన్నాయి.  



కేవ్స్ 



 చీకటిలో భయంగా అనిపించినా, మా గైడు పడవను జాగ్రత్తగా నడుపుతూ, మాకు గుహ విశేషాలని వివరించాడు.   మా చేతులతో ఆ గుహను తాకుతూ, అక్కడ  ప్రవహించే నీటి శబ్దాలని వింటూ ఆనందిచాము. ఆ పడవ ప్రయాణం మాకు మర్చిపోలేని అనుభూతిని మిగిలించింది. మరుసటి రోజు ఒక బొగ్గుగనిని సందర్శించాము .అక్కడ ప్రస్తుతము బొగ్గు తవ్వకం నిలిపి వేయటం వలన, దానిని చూడటానికి పర్యాటకులను అనుమతిస్తున్నారు. అక్కడ కూడా 10 మందికి కలిపి ఒక గైడ్ ని  ఏర్పాటు చేసారు. అతను బాగా సరదా మనిషి అవ్వటం వలన, అందరిని నవ్విస్తూ గని విశేషాలు తెలియచేసారు. ఆ గని లోపల 300 మీటర్లు వరకు మమ్ముల్ని తీసుకుని వెళ్ళి, బొగ్గుని త్రవ్వటానికి అవసరం అయిన మెషిన్లు మరియు ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు అన్ని చక్కగా చూపిస్తూ వివరించారు.


బొగ్గు గని 
గని లోపల అక్కడక్కడ నీటి చుక్కలు పడుతున్నాయి. అందువలన మాకు ముందుగానే వేసుకొటానికి కోట్లు మరియు క్యాపులు ఇచ్చారు . అవి వేసుకుని, మేము అక్కడ పని చేసే వారిలా అనుభూతి చెందాము. తర్వాత మేము మౌన్ద్  సౌవాజ్ అనే సఫారీకి వెళ్ళాము. అక్కడ చాలా రకముల జంతువులని దగ్గరగా చూసి వాటిని పట్టుకుని ఆనందించాము .ఆ పార్కులో పర్యాటకుల కోసం చిలకల, గ్రద్దల మరియు సీల్ ప్రదర్శనలు ఏర్పాటు చేశారు, అవి మమ్ముల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి .




లోకల్ మార్కెట్ 

బ్రుస్సేల్స్ లో మేము వాఫల్స్ అని పిలవబడే పలుచటి కేకుని రుచి చూసాము. దాని మీద క్రీం మరియు వివిధ రకముల పండ్ల ముక్కలతో ఎంతో అందంగా అలంకరించారు. బెల్జియం చాకోలెట్స్ కూడా చాల ప్రాముఖ్యత కలవు. వాటిని రుచి చూసి, మరికొన్ని కొనుగోలు చేసాం . 

వాఫల్స్ 
 ఇవండీ బ్రుస్సేల్స్ యొక్క విశేషాలు మరియు మా మధురమైన అనుభూతులు.  మళ్లి ఇంకొక ప్రాంత విశేషాలతో మీ ముందు ఉంటాం. ధన్యవాదములు.  



No comments:

Post a Comment