Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Sunday 16 October 2016

Barbecue nation Review


 బార్బెక్యూ నేషన్ రెస్టారెంట్ యొక్క విశేషాలు మీకు తెలియపరచదలిచాం .ఇది సయాజీ హోటల్స్ వారి రెస్టారెంట్ ,దీని యొక్క బ్రాంచీలు భారత దేశం లో ఉన్న అన్ని ముఖ్య రాజధాని నగరాల్లో విస్తరించి ఉన్నవి. ఈ రెస్టారెంట్ పేరులోనే ఉంది ఇక్కడేం స్పెషలో, అవునండి బార్బెక్యూ ఐటమ్స్ వీరి ప్రత్యేకత. ఇక్కడ బఫెట్ మాత్రమే దొరుకుతుంది ,మీరు తినగలగాలే కానీ చెప్పలేనన్ని వైరిటీలు సర్వ్ చేస్తారు. 



రెస్టారెంట్ లోకి అడుగుపెట్టగానే వెయిటర్ మేము రిజర్వు చేసుకున్న టేబుల్ చూపించాడు. తరువాత సర్వర్ వొచ్చి మేము శాకాహారులమో లేక మాంసాహారులమో అడిగి ఈరోజా  ఏదైనా ప్రత్యమైన రోజా అని  తెలుసుకున్నాడు , అదేనండి మీ పెళ్లిరోజు లేక పుట్టినరోజా అన్న వివరాలు అడుగుతారు . తర్వాత బొగ్గుల కుంపటిని తీస్కుని వచ్చి మన ముందు పెడతారు, మాంసాహారులకి చికెన్, మటన్, ఫిష్ , రొయ్యలని రకరకాల మసాలాలతో మ్యారినేట్ చేసి వాటిని కొద్దిగా కాల్చి ఒక ఇనుప చువ్వకు గుచ్చి(స్కువెర్స్) మన ముందు ఉన్న బొగ్గుల కుంపటి పైన పెడతారు.  శాకాహారులకి రక రకాల పండ్లు, కూరగాయ ముక్కలు మరియు పనీర్ ని చువ్వకు గుచ్చి బొగ్గుల కుంపటి మీద ఉంచుతారు . వాటి మీద మన టేబుల్ ఫై ఉన్నరకరకాల సాస్లని అక్కడ ఉన్న బ్రెష్ తో పూసి ఇనుపచువ్వని తిప్పుతూ కాల్చుకోని తినాలి. ఇవే కాకుండా మనకి రకరకాల స్టాటర్లని సర్వ్ చేస్తూనే ఉంటారు. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఉందండి, మన ముందు జెండా లాగా ఉండే ఇత్తడి వస్తువుని ఉంచుతారు,  జెండా ఎగురుతున్నట్లుగా ఉంటె మన ముందు స్టార్టర్లు ప్రత్యక్షమవుతూనే ఉంటాయి. జెండా దింపినట్లుగా ఉంటే స్టార్టర్లు సర్వ్ చేయడం ఆపేస్తారు  .


ఇక్కడ బార్బెక్యూ ఐటమ్స్ తో పాటు రక రకాల సలాడ్స్, సూపులు, బిర్యానీలు, కర్రీలు, నూడుల్స్, రోటీలు, స్వీట్లు ,కేకులు, ఐస్క్రీమ్ లు మరియు కుల్ఫీలు దొరుకుతాయి. అన్ని మీరు ఎంత తినగలిగితే అంత తినొచ్చు. మీ బర్త్ డే లేక పెళ్లిరోజున వెళ్తే వారు మీకోసం ఒక కేక్ కాంప్లిమెంటరీ (ఫ్రీ )గా  తెచ్చి కోయమనడమే కాకుండా మీ టేబుల్ ముందు సర్వర్లు అందరు డాన్స్ చేస్తూ, పాటలు పాడుతూ తమదైన స్టైల్ లో విష్ చేస్తారు. ఆ రోజు మా ఫ్రెండ్ పుట్టినరోజు వాళ్ళు అలా మా టేబుల్ ముందు డాన్స్ చేస్తుంటే మొహమాటంగా అనిపించినా ఇది ఒక కొత్త అనుభూతి అనుకున్నాం.    
మా రివ్యూ:
  • రేటింగ్ : 9/10
  • రికమెండ్ చేయదగిన ఐటమ్స్: ఫ్రైడ్ కార్న్, స్పైసి పొటాటో, మటన్ కబాబ్, గ్రిల్ ఐటమ్స్ ,బిర్యానీ, పేస్ట్రీ లు , కుల్ఫీలు       
  •  ధర: 1400-1800 రూపాయలు (ఇద్దరికి) 
  • బుకింగ్ : అవసరం 
  •  బెస్ట్ టైం : మధ్యాహ్నం ( బఫెట్ రేట్ తక్కువగా ఉంటుంది )


1 comment: