Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Thursday 13 October 2016

kitchen tips (వంటింటి చిట్కాలు)

1. కూరలో మసాలా ఘాటు ఎక్కువ అయితే ,1 లేద 2  టమాటాలను  ఉడికించి అందులో కలపండి .అప్పుడు మసాలా ఘాటు తగ్గి కూర రుచిగా ఉంటుంది.

2. కూరలో ఉప్పు ఎక్కువ అయినప్పుడు కొంచెం నిమ్మరసం కలుపుటవలన ఉప్పదనం తగ్గుతుంది . మైదా లేదా శెనగ  పిండి 1 టీ స్పూన్  తీసుకుని 1/2 కప్ నీటిలో కలిపి కూరలో వేయటం వలన కూడా ఉప్పదనం తగ్గి కూర రుచిగా ఉంటుంది . 

3. చింతపండు రంగు మారకుండా ఎక్కువ రోజులు తాజాగా  నిల్వ  ఉండాలంటే  కొంచెం ఉప్పు చల్లి, గాలి తగలని డబ్బాలో ఉంచండి. 

4. కూరగాయలు తరిగేటప్పుడు చేయి తెగిన అలోవెరా జెల్లు ని రాయండి మరియు కాలిన గాయాలకి కూడా అలోవెరా జెల్ బాగా పనిచేస్తోంది. 

5. కొబ్బరి ముక్కను పెరుగులో వేస్తే  తొందరగా  పెరుగు పాడు అవ్వదు. 

No comments:

Post a Comment