Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Saturday 15 October 2016

Vapiano ,Germany(వాపియానో, జర్మనీ)


అందరికి నమస్కారం, మేము ఈరోజు వాపియానో అనే రెస్టారెంట్ యొక్క రివ్యూ రాయదలిచాం . ఈ రెస్టారెంట్ యొక్క బ్రాంచీలు ప్రపంచంలోని అన్ని ముఖ్య నగరాలలో ఉన్నవి . మేము జర్మనీ దేశంలో స్టూట్ట్గర్ట్ (Stuttgart) అనే నగరంలో ఉన్న బ్రాంచికి వెళ్ళాము . రెస్టారెంట్లోకి అడుగుపెట్టగానే మనకి క్రెడిట్ కార్డులా ఉండే కార్డులని ఇస్తారు. అవి పారేయకుండా జాగ్రత్తగా మన వద్దనే ఉంచుకోవాలి. ఎందుకంటే మనం ఏమి తిన్నామో మరియు మన బిల్ ఎంత అయ్యిందో ఆ కార్డులో నిక్షిప్తం అయిఉంటుంది. ఎలానో కొంచెం వివరంగా చెప్తాను వినండి. మనకి వాళ్ళు ఇచ్చిన కార్డునితీసుకుని అక్కడ కనిపించే స్టాల్ల్స్ వద్దకు వెళ్ళాలి. అందులో 2 లేక 3 స్టాళ్లలో పాస్తా చేయబడుతుంది. 1 స్టాల్లో పిజ్జా మరియొక దానిలో సలాడ్లు, కాఫీ మరియు స్వీట్స్ కొరకు ఒక స్టాల్ ఏర్పాటుచేస్తారు. మనకి కావాల్సినవి ఆర్డర్ చేసుకున్నాక అక్కడ స్కానర్ మీద ఈ కార్డుని ఉంచితే దానిలో మన ఆర్డర్ నిక్షిప్తం అవుతుంది. తినడం ముగించుకుని వెళ్ళేటపుడు కార్డుని స్కాన్ చేసి మనం ఏమి తిన్నామో మరియు మన బిల్ ఎంత అయ్యిందో వారి కంప్యూటర్లో  ప్రత్యక్షం అవుతుంది. దాన్ని మనకి ప్రింట్ తీసి ఇస్తారు. పాస్తా చేయడం కోసం వాడే విభిన్న నూడుల్స్ ని ఫ్రెష్ గా అప్పటికపుడు పిండితో తయారు చేస్తూ ఉంటారు.  


ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఉంది ,మనం ఏది ఆర్డర్ చేసిన వాళ్ళు మనముందే అప్పటికపుడు తయారు చేస్తారు. తయారు చేసేటప్పుడు  ఏమి వేయాలో ఎంత వెయ్యాలో అడుగుతారు. మనం చెప్పిన దాన్నిబట్టి మన రుచికి తగ్గట్లుగా తయారు చేస్తారు. ఇక్కడ అన్నిటికన్నా పాస్తాలు బాగుంటాయి. రుచిగా ఉండే పిజ్జాలు మనకి చాలా చోట్ల దొరుకుతాయి. పాస్తా మాత్రం అన్నిచోట్ల దొరకవు. మాకు ఇది బాగా నచ్చిన ఇటాలియన్ రెస్టారెంట్. మేము ఇక్కడ రటటౌలి(టమాటో సాస్ లో వంకాయలు, జుకీనీ, కాప్సికం ,ఉల్లిపాయలు మరియు చీజ్ తో తయారు చేస్తారు ) , అగ్లియో ఈ ఒగ్లియో (పండుమిరపకాయ, వెల్లులి, ఆలివ్ నూనె మరియు పార్స్లీ తో తయారు చేస్తారు ) , పెస్టో రోసో (పైన్ గింజలు,సాస్, ఎండబెట్టిన టమాటో, చిల్లి , ricotta, చీజ్ తో తయారు చేస్తారు ), పెస్టో బాసిలికో (రోస్టు చేసిన పైన్ విత్తనాలు, బేసిల్ పేస్ట్, చీజ్ ), క్రిమ ది ఫంగి (పుట్ట గొడుగులు, క్రీమ్ సాస్, ఉల్లిపాయలు, వైట్ వైన్) అనే పాస్తాలు రుచి చూసాం.verdure (అన్ని కూరగాయలుతో చేసే పిజ్జా ), పెస్టో కాన్ స్పినకి (పాలకూర ఆకులు, టొమాటోలు, పెస్టో క్రీమ్, మొజోరీళ్ల చీజ్ ) అనే పిజ్జాలు రుచిచూసాం. అందులోను మాకు పెస్టో కాన్ స్పినకి అనే పిజ్జా చాలా నచ్చింది, ఇది మిగతా పిజ్జాలకు భిన్నంగాను మరియు రుచిగాను ఉన్నది. తిరామసు (మెత్తటి బిస్కెట్, క్రీం ,కాఫీతో చేస్తారు ) అనే స్వీట్ మరియు పన్నాకోటా(పాలు, జిలెటిన్, స్ట్రాబెర్రీ సాస్ ) అనే స్వీట్ చాలా రుచిగా ఉన్నవి. 


  మా రివ్యూ:
  • రేటింగ్ : 9/10
  • రికమెండ్ చేయదగిన ఐటమ్స్అగ్లియో ఈ ఒగ్లియో, పెస్టో రోసో,  పెస్టో బాసిలికో, పెస్టో కాన్స్పినకి, తిరమసు,పన్నాకోటా 
  •  ధర: 18-30 యూరోలు 
  • బుకింగ్ : అవసరంలేదు 

No comments:

Post a Comment