Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

Friday 21 October 2016

Palakura rice, palak rice, spinach rice(పాలకూర రైస్)



కావాల్సినవి:
 పాలకూర ఆకులు -2 కప్పులు, ఉడికించిన అన్నం -1 కప్పు , పచ్చిమిర్చి -4, జీడిపప్పు - 10, నూనె- 2టేబుల్ స్పూన్స్, అల్లం,వెల్లుల్లి ముక్కలు-1 టీ  స్పూను చొప్పున, జీలకర్ర-1 టీస్పూను, ఎండుమిర్చి- 2, ఉల్లిపాయ -1, లవంగాయాలు -4, దాల్చిన చెక్క-1 చిన్న ముక్క, పచ్చిపప్పు-1 టీస్పూన్, కొత్తిమీర - కొంచెం, ఉప్పు- రుచికి సరిపడినంత.





తయారీ:
ముందుగా ఒక గిన్నెలో నీరు పోసి పాలకూర ఆకులు వేసి ఉడికించుకోవాలి. ఆకులుని నీటి నుండి తీసి చల్లారనివ్వాలి.  తరువాత పాలకూర, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర ,కొంచెం ఉప్పు  వేసి మెత్తని గుజ్జులా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.


కడాయి తీసుకుని నూనె పోసి వేడి అయ్యాక జీలకర్ర, పచ్చిపప్పు, ఎండుమిర్చి, లవంగాయాలు, దాల్చిన చెక్క, జీడిపప్పు వేసి వేగనివ్వాలి. తరువాత అల్లం వెల్లుల్లి ముక్కలు వేసి ఒక నిమిషం వేగాక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కొంచెం ఎర్రగా అయ్యేవరకు వేయించుకోవాలి.


 తరువాత  ముందుగా చేసి పెట్టుకున్న పాలకూర గుజ్జు కూడా వేసి తక్కువ మంట మీద నూనె బయటికి వచ్చే వరకు ఉడికించుకోవాలి. చివరగా అన్నం వేసుకుని పాలకూర గుజ్జు అంతా అన్నానికి పట్టేలా కలుపుకోవాలి. అంతే పాలకూర రైస్ సిద్ధం.


గమనిక:
పాలకూరని ఉడికించకుండా పచ్చిగా  కూడా పేస్ట్ చేసుకుకోవచ్చు. కొంచెం పులుపు కూడా కావాలి అనుకునే వాళ్ళు చివరిలో నిమ్మరసం వేసుకుంటే సరిపోతుంది. 

No comments:

Post a Comment